మెగాపవర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న గేమ్ ఛేంజర్ మూవీ పై మొదటి నుండి మెగా ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని దిల్ రాజు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్, ఫస్ట్ లుక్ టీజర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై అంచనాలు మరింతగా పెంచేసాయి. ముఖ్యంగా ఈమూవీలో రామ్ చరణ్ డ్యూయల్ పోషిస్తుండగా ఇతర కీలక పాత్రల్లో జయరాం, ప్రకాష్ రాజ్, ఎస్ జె సూర్య, అంజలి, సునీల్ నటిస్తున్నారు. ఇక విషయం ఏమిటంటే, గేమ్ ఛేంజర్ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని 21 డిసెంబర్ న యుఎస్ఏ లోని కర్టిస్ కల్వేల్ సెంటర్, 4999 నామెన్ ఫారెస్ట్, గార్లాండ్ టెక్సాస్ లో గ్రాండ్ లెవెల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం అఫీషయల్ గా తెలిపారు.
ముఖ్యంగా ఒక తెలుగు సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో జరుగుతుండడం ఇదే ప్రధమం. ఈ విధంగా అటు యుఎస్ఎస్ తో పాటు ఓవర్సీస్ ఆడియన్స్ లో కూడా తమ మూవీ పై మరింత హైప్ ఏర్పరిచేలా గేమ్ ఛేంజర్ టీమ్ ఆలోచనని అందరూ మెచ్చుకుంటున్నారు. కాగా ఈ మూవీ 2025 జనవరి 10న ఆడియన్స్ ముందుకి రానుంది.