మెగాపవర్ స్టార్ గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్, దిగ్గజ దర్శకుడు శంకర్ ల తొలి కలయికలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీ పై మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా బాగా అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల రిలీజ్ అయిన సెకండ్ సొగ్ రా మచ్చా మచ్చా అయితే యువత అండ్ మాస్ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని అంచనాలు మరింతగా పెంచేసింది.
ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా దిల్ రాజు గ్రాండ్ లెవెల్లో దీనిని నిర్మిస్తున్నారు. అయితే మ్యాటర్ ఏమిటంటే, తాజాగా రిలీజ్ అయిన సెకండ్ కి సంబంధించి పలువురు ఇన్స్టాగ్రామ్ వారు ఆ పాటకు చిందిస్తూ దానికి సంబంధించి ప్రమోషన్ చేస్తున్నారు.
అయితే ఈ రకమైన ప్రమోషన్ స్ట్రాటజీని గేమ్ ఛేంజర్ టీమ్ భారీగానే డబ్బు కేటాయించి చేయించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఫస్ట్ సాంగ్ జరగండి కి అంతగా రెస్పాన్స్ రాకపోవడంతో టీమ్ ఈ విధంగా సెకండ్ ని ప్రమోట్ చేయించడం ఒకింత మెచ్చుకోదగ్గ విషయం అని చెప్పాలి. కాగా దసరా నాడు రానున్న గేమ్ ఛేంజర్ టీజర్ లో రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు.