మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీని ప్రముఖ దర్శకుడు శంకర్ గ్రాండ్ లెవెల్లో తీస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మస్తున్నారు.
బాలీవుడ్ నటి కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి ఎస్ థమన్ సంగీత దర్శకుడు. ఇటీవల గేమ్ ఛేంజర్ నుండి రిలీజ్ అయిన జరగండి సాంగ్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం మూవీ యొక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతోంది. అయితే ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి డిసెంబర్ 20న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్ సన్నాహాలు చేస్తున్నారు.
కాగా లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉందని అంటున్నారు. సెట్స్ లో ఇంకా కొన్ని సీన్స్ తీస్తున్నారని, త్వరలోనే దానిని పూర్తి చేసేలా టీమ్ కృషి చేస్తోందట. మొత్తంగా గేమ్ ఛేంజర్ ని అనుకున్న టైం కి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని అర్ధమవుతోంది