మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ యాక్షన్ పొలిటికల్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీలో ఎస్ జె సూర్య, సునీల్, అంజలి, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా ఇందులో ఐఏఎస్ అధికారి రామ్ నందన్ పాత్రలో కనిపించనున్నారు రామ్ చరణ్. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈమూవీని ఈ ఏడాది ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే మ్యాటర్ ఏమిటంటే, కొన్నాళ్ల క్రితం ఈ మూవీ సెట్స్ నుండి పలు సీన్స్ తాలూకు ఫోటోలు వీడియోస్, ఫస్ట్ సాంగ్ ఆడియో సోషల్ మీడియాలో లీక్ అయి చక్కర్లు కొట్టాయి. ఇక తాజాగా ఈ మూవీ నుండి ఎయిర్పోర్ట్ లో చిత్రీకరిస్తున్న మరొక సీన్ యొక్క ఫుటేజీ లీక్ అయి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
మొత్తంగా ఈ విధంగా తమ హీరో మూవీ నుండి వరుసగా సీన్స్ లీకుల బారిన పడుతుండడంతో చరణ్ ఫ్యాన్స్ నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. ఇకపై గేమ్ ఛేంజర్ టీమ్ ఈ విషయమై మరింత గట్టి జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. మరి మూవీ టీమ్ ఇకపై ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.