మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. తొలిసారిగా దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న ఈ మూవీలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ నుండి ఇటీవల రిలీజ్ అయిన జరగండి సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. త్వరలో మూవీ నుండి సెకండ్ సాంగ్ తో పాటు వరుసగా మిగతా అప్ డేట్స్ ని అందించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇటీవల హీరో రామ్ చరణ్ మూవీలో తన పార్ట్ షూట్ మొత్తం పూర్తి చేసుకున్నారు. అలానే మూవీలో బ్యాలన్స్ ఉన్న కొద్దిపాటి షూట్ ని అతి త్వరలో ప్రారంభించి పూర్తి చేసేందుకు టీమ్ సిద్ధం అవుతోంది. అయితే విషయం ఏమిటంటే, ప్రస్తుతం గేమ్ ఛేంజర్ యొక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతోందట. అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా దర్శకుడు శంకర్ దీనిని అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు టీమ్ చెపుతోంది.