టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా గేమ్ చేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ వ్యయంతో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా కీలక పాత్రలో అంజలి కనిపించారు.
ఇక ఇతర ముఖ్యపాత్రల్లో రాజీవ్ కనకాల, శ్రీకాంత్, ఎస్ జె సూర్య, సముద్రఖని తదితరులు నటించారు. మొదటి నుంచి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి డిజాస్టర్ గా నిలిచింది.
రామ్ చరణ్ రెండు పాత్రలలో కనిపించిన ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందించారు. ఇక బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం పెరఫామ్ చేయలేకపోయిన గేమ్ చేజర్ మూవీ ఇటు ఓటిటిలో రిలీజ్ అనంతరం కూడా ఆశించిన రెస్పాన్స్ అయితే అందుకోలేదు. మొత్తంగా రూ. 450 కోట్ల సాధించాల్సిన ఈ సినిమా రూ.195 కోట్ల వద్ద ఆగిపోయింది.
ఇక సౌత్ ఇండియన్ భాషల్లో ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా హిందీ ఓటిటి హక్కులను ప్రముఖ సంస్థ జీ 5 వారు సొంతం చేసుకున్నారు. విషయం ఏమిటంటే, గేమ్ ఛేంజర్ హిందీ వర్షన్ ఓటిటి నేటి నుండి ఆడియన్స్ కి అందుబాటులోకి వచ్చింది. మరి హిందీ ఆడియన్స్ నుండి గేమ్ చేంజర్ ఏ స్థాయిలో రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.