టాలీవుడ్ స్టార్ యాక్టర్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ పై అటు మెగా ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ అందాల కథానాయిక కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో శ్రీకాంత్, అంజలి, ఎస్ జె సూర్య, జయరాం తదితరులు నటిస్తున్నారు.
శంకర్ గ్రాండ్ లెవెల్లో తెరకెక్కించిన ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించగా ఎస్ థమన్ సంగీతం అందించారు. ముఖ్యంగా ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో మంచి క్రేజ్ అందుకున్న ఈ మూవీ నేడు గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. మ్యాటర్ ఏమిటంటే, ఇటీవల కొంత మెల్లగా ప్రారంభం అయిన ఈమూవీ యొక్క నార్త్ బెల్ట్ బుకింగ్స్ ప్రస్తుతం మంచిగా ఊపందుకున్నాయి.
ముఖ్యంగా నేషనల్ మల్టి ప్లెక్స్ లో ఈ మూవీ తాజాగా 30 కె కి చేరుకోగా ఇది షోస్ ప్రారంభానికి ముందు 50 కె వరకు చేరుకునే అవకాశం ఉంది. మంచి పాజిటివ్ టాక్ కనుక వస్తే మూవీ అక్కడ మరింతగా పుంజుకునే అవకాశం ఉంది. ఇక ఈ మూవీ హిందీ బెల్ట్ లో రూ. 100 కోట్ల నెట్ అందుకునే అవకాశం ఉంది, అయితే మూవీకి పాజిటివ్ టాక్ వస్తే ఇది సాధ్యం అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మంచి క్రేజ్ అందుకున్న చరణ్ నార్త్ లో గేమ్ ఛేంజర్ తో ఎంత మేర కలెక్షన్ అందుకుంటారో చూడాలి.