టాలీవుడ్ స్టార్ యాక్టర్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో ఎస్ జె సూర్య, శ్రీకాంత్, అంజలి, సునీల్ తదితరులు నటిస్తున్నారు. చరణ్ ఈ మూవీలో డ్యూయల్ రోల్ చేస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు దీనిని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన రెండు సాంగ్స్ అందరినీ ఆకట్టుకోగా నవంబర్ 27న మూడవ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ మూవీ రానున్న 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న భారీ స్థాయిలో ఆడియన్స్ ముందుకి రానుంది. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ గా టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మూవీ అద్భుతంగా వస్తోందని అంటున్నారు.
అయితే మ్యాటర్ ఏమిటంటే, తాజాగా ఈ మూవీకి సంబంధించి నటుడు ఎస్ జె సూర్య పోస్ట్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గేమ్ ఛేంజర్ కి సంబంధించి రెండు కీలక సీన్స్ కి డబ్బింగ్ చెప్పడానికి దాదాపుగా మూడు రోజులు పట్టిందని అవి రేపు థియేటర్స్ లో బ్లాస్ట్ అవ్వడం ఖాయం అంటూ ఆయన తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసారు. దీనితో ఇప్పటివరకు మూవీ పై ఉన్న అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. మరి రిలీజ్ తరువాత గేమ్ చేంజర్ మూవీ ఎంతమేర విజయం సొంతం చేసుకుంటుందో చూడాలి.