టాలీవుడ్ స్టార్ యాక్టర్ గ్లోబల్ ఐకాన్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియన్ పొలిటికల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా కీలక పాత్రల్లో ఎస్ జె సూర్య, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, నాజర్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు.
ఈ మూవీలో ఐఏఎస్ అధికారి రామ్ నందన్ పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. మొదటి నుండి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన రెండు సాంగ్స్ ఆకట్టుకుని ఆ అంచనాలు మరింతగా పెంచేశాయి.
విషయం ఏమిటంటే, వాస్తవానికి డిసెంబర్ 20న విడుదల కావాల్సిన గేమ్ ఛేంజర్ మూవీ తాజాగా 2025 సంక్రాంతికి రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీకి డిస్ట్రిబ్యూటర్స్ నుండి భారీ ఆఫర్స్ రానున్నాయి. దాని ప్రకారం సంక్రాంతి సెలవుల సీజన్ లో మూవీ సక్సెస్ టాక్ తెచ్చుకుంటే కలెక్షన్స్ వర్షన్ ఖాయం. మరి ఒకవైద్యంగా ఇది నిర్మాత దిల్ రాజుకు పెద్ద జాక్ పాట్ అని చెప్పాలి.