గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీలో ఎస్ జె సూర్య, సునీల్, అంజలి తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీ డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. ఇక ఇటీవల గేమ్ ఛేంజర్ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ జరగండి బాగానే రెస్పాన్స్ సొంతం చేసుకోగా సెకండ్ సాంగ్ ఈ నెలలో రిలీజ్ చేస్తాం అంటూ ఇటీవల మేకర్స్ తెలిపారు. అయితే మ్యాటర్ ఏమిటంటే, గేమ్ ఛేంజర్ నుండి నెక్స్ట్ అప్ డేట్ నెక్స్ట్ వీక్ అందించనున్నట్లు సంగీత దర్శకుడు థమన్ ఇప్పటికే తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
కాగా దానిని బట్టి నెక్స్ట్ వీక్ ఈ మూవీ నుండి సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నట్లు అర్ధమవుతోంది. ఇక అక్కడి నుండి వరుసగా అప్ డేట్స్ ఉంటాయని తెలిపారు థమన్. మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ రిలీజ్ తరువాత ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి.