Homeసినిమా వార్తలుడిసెంబర్ 9 నుండి OTTలో ప్రసారం కానున్న నాలుగు తాజా తెలుగు సినిమాలు

డిసెంబర్ 9 నుండి OTTలో ప్రసారం కానున్న నాలుగు తాజా తెలుగు సినిమాలు

- Advertisement -

డిసెంబర్ 9వ తేదీన తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు నాలుగు కొత్త సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే అవి ధియేటర్ లో కాదు సుమీ.. ఆ సినిమాలు తమ ప్రీమియర్‌ల ద్వారా OTT ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. యశోద, ఊర్వశివో రాక్షసివో, లైక్ షేర్ సబ్స్క్రయిబ్ మరియు మాచర్ల నియోజకవర్గం సినిమాలు వచ్చే శుక్రవారం ఆన్‌లైన్‌లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి.

యశోద ఒక సస్పెన్స్ థ్రిల్లర్, సమంత ఈ సినిమాలో అద్దె తల్లిగా ఉండేందుకు ఒప్పుకునే పాత్రలో నటించారు. సమంత అక్కడి సవాళ్లను ఎలా ఎదుర్కొంటుంది మరియు ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితుల నుండి బయటపడడం.. అలాగే మెడికల్ క్రైమ్ రాకెట్‌ను ఎలా శిక్షిస్తుంది అనేది చాలా ఆసక్తికరంగా చూపబడింది.

వెండి తెర పై ఈ సినిమాని మిస్ అయిన ప్రేక్షకులు డిసెంబర్ 9 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో సమంత అద్భుత ప్రదర్శనను హాయిగా ఆస్వాదించవచ్చు.

ఊర్వశివో రాక్షసివో సినిమా ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో అల్లు శిరీష్ మరియు అను ఇమ్మానుయేల్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రంలో చాలా మంచి కామెడీ ఉంది, ముఖ్యంగా వెన్నెల కిషోర్ నవ్వులు పంచిన విధానానికి బాగా పేరొచ్చింది. మరియు ప్రధాన జంట మధ్య కెమిస్ట్రీ వల్ల ఖచ్చితంగా ఒకసారి చూడదగిన చిత్రంగా మారింది. ఆహా వీడియోలో ఈ సినిమా ప్రీమియర్ షో వేయనున్నారు.

లైక్ షేర్ సబ్స్క్రయిబ్ మరియు మాచర్ల నియోజకవర్గం రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం పాలయ్యాయి. అయినప్పటికీ, ఆ రెండు సినిమాల్లోనూ ఏదో ఒక రకంగా కామెడీ మరియు మసాలా వినోదాల వంటి అంశాలతో ప్రేక్షకులను ఆనందింప జేస్తాయి అని అంచనా వేస్తున్నారు.

READ  NTR30 స్క్రిప్ట్ ఆల్రెడీ రామ్ చరణ్ రిజెక్ట్ చేసిందా?

మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించడంతో ఒక ఉల్లాసకరమైన ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది అనుకున్న లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది మరియు ఈ చిత్రం సోనీ లివ్ ప్లాట్ ఫారంలో అందుబాటులో ఉంటుంది. ఇక నితిన్ యొక్క మాచర్ల నియోజకవర్గం మరొక OTT దిగ్గజం ప్లాట్‌ఫారమ్ Zee5లో ప్రసారం చేయబడుతుంది.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories