Homeసినిమా వార్తలుఫస్ట్ టైం ఇన్ టాలీవుడ్ అంటున్న పక్కా కమర్షియల్ ప్రొడ్యూసర్

ఫస్ట్ టైం ఇన్ టాలీవుడ్ అంటున్న పక్కా కమర్షియల్ ప్రొడ్యూసర్

- Advertisement -

గోపీచంద్ – రాశి ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘పక్కా కమర్షియల్’ గీతా ఆర్ట్స్ 2 – యూవీ క్రియేషన్స్ కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో గోపీచంద్ లాయర్ గా నటిస్తుండగా,తండ్రి పాత్రలో సత్యరాజ్ కనిపించబోతున్నారు. అలాగే హీరోయిన్ రాశి ఖన్నా ఇందులో సీరియల్ హీరోయిన్ తో పాటు లాయర్ గా కూడా కనిపిస్తుండటం విశేషం.మారుతి మార్కు కామెడీ తో పాటు గోపీచంద్ నుండి ఆశించే యాక్షన్ సన్నివేశాలకు కొదవ ఉండదని ట్రైలర్ లు చూస్తేనే తెలుస్తుంది.

జేక్స్ బిజోయ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఇటివలే విడుదల అయిన ‘అందాల రాశి’ పాట మంచి స్పందన వచ్చింది. వచ్చేనెల 1వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంభందించిన పబ్లిసిటీ గురించి చర్చించడానికి నిర్మాత బన్నీ వాసు, దర్శకుడు మారుతి మరియు పీఆర్వో టీమ్ తో కలిశారు.

ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ఎవ్వరూ చేయని విధంగా ఏదో ఒక కొత్త పద్ధతిలో సినిమాను ప్రచారం చేయాలి అని చెప్పగా, ఆయన టీమ్ అందుకు రకరకాల ఐడియాలు ఇచ్చారు,అవేవీ వాసుకి,మారుతికి నచ్చకపోవడం వాళ్ళు ఆ ఐడియాల మీద సెటైర్ లు వేయడం కాస్త సరదాగానే గడిచింది మొత్తం వ్యవహారం.

READ  రాకీ భాయ్ తో సాలార్?

అయితే మొత్తానికి తేలింది ఎంటి అంటే ఈ నెల 26న టాలీవుడ్ చరిత్రలోనే మొట్ట మొదటిసారి అంటే ఫస్ట్ టైం అనే టాగ్ తో “పక్కా కమర్షియల్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.అంటే అర్ధం అయింది కదా, ఆల్రెడీ ఎన్నో ప్రచార కార్యక్రమాలు నిర్వహించేసాక ఇప్పుడు అందరూ చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నే కేవలం “ఫస్ట్ టైం” అన్న టాగ్ తో చేయబోతున్నారు అన్నమాట. ఏమైనా సినిమాకి తగ్గట్టే ఎంటర్టైన్మెంట్ తో కూడుకున్న ఈ ఈవెంట్ తో పాటు సినిమా కూడా సక్సెస్ అయి గోపీచంద్ ఆశిస్తున్న హిట్ దక్కుతుంది అని కోరుకుందాం.

Follow on Google News Follow on Whatsapp

READ  Box-Office: రజినీకాంత్ తరువాత మళ్ళీ కమల్ ఆ రికార్డ్ కొట్టారు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories