Homeసినిమా వార్తలుతొలి రోజే ఘోర పరాజయం పాలైన ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా

తొలి రోజే ఘోర పరాజయం పాలైన ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా

- Advertisement -

ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా సెప్టెంబర్ 2న థియేటర్లలో విడుదలై మంచి అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమాకి రచయితగా జాతి రత్నాలు దర్శకుడు కెవి అనుదీప్ పేరు ఉండటంతో చాలా మంది ఈ సినిమా కూడా జాతిరత్నాలు సినిమాల ఒక మంచి ఎంటర్టైనర్ గా ఉంటుందని అందరూ అనుకున్నారు.

కానీ, ఈ చిత్రం తొలి రోజు అతి దారుణమైన టాక్ మరియు సమీక్షలను తెచ్చుకుంది. అంత దారుణమైన మౌత్ టాక్ వల్ల కలెక్షన్లు కూడా అంతే తక్కువగా వచ్చాయి. సినిమాకు ప్రేక్షకుల నుంచి తీవ్రమైన నెగటివ్ టాక్ వచ్చింది.. ఎందుకంటే సినిమాలోని ఏ అంశం కూడా ప్రేక్షకులకి వినోదాత్మకంగా లేదా అలరించిన విధంగా అనిపించలేదు పైగా విసుగు తెప్పించే విధంగా సినిమా నడక సాగింది.

అనుదీప్ కెవి సినిమా ప్రచార కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొన్నప్పటికీ.. ఏమాత్రం లాభం లేకుండా పోయింది. సినిమాలో కంటెంట్ పరంగా ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఏవీ లేకుండా పోయాయి. అసలు ఒక సినిమాను తీయాల్సిన కథే కాదు అని ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా గురించి విమర్శకులు, ప్రేక్షకులు అభిప్రాయ పడ్డారు. కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు లేదా సినీ ప్రియులు మాత్రమే ఈ చిత్రకథతో కాస్త కనెక్ట్ అవగలరు. వాళ్ళు కూడా కొద్దిసేపటి తరవాత బోర్ ఫీల్ అయ్యేలా ఇక గమ్యం లేకుండా సినిమా నడిచింది. ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా ఏ స్థాయిలో నత్తనడకన సాగింది అంటే సినిమా ఇంకా ముగియకుండానే ప్రేక్షకులు థియేటర్ల నుంచి బయటకు వెళ్లిపోయారు.

READ  Thank you movie: థాంక్యూ సినిమా సెన్సార్ మరియు ప్రీమియర్ షో డిటైల్స్

సినిమా బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే, ఇది డిజాస్టర్ దిశగా పయనించనుందని తొలి రోజే డిసైడ్ అయిపోయింది. నిజానికి ఈ సినిమాకు ధియేటర్లు అనుకున్నంత స్థాయిలో దక్కలేదు. కానీ ఆ దక్కిన ధియేటర్లలో కూడా కనీస షేర్లను రాబట్టడంలో సినిమా విఫలమై దాదాపు ప్రతి షోకూ ప్రేక్షకుల సంఖ్యను తగ్గించుకుంటూ వచ్చింది. ఆ రకంగా ఈ సినిమా తొలిరోజే బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయం పాలయింది. ఫస్ట్ డే ఫస్ట్ షో అనే టైటిల్ తో వచ్చిన ఈ సినిమా.. చిత్రంగా ఫస్ట్ షో సమయానికి కొట్టుకుపోయినట్లుంది.

ఈ చిత్రంలో శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు,వంశీదర్ గౌడ్, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి, తదితరులు నటించారు. ఈ చిత్రానికి లక్ష్మీనారాయణ, వంశీదర్ గౌడ్ దర్శకులు కాగా, రాధన్ సంగీత దర్శకుడుగా వ్యవహరించారు.

Follow on Google News Follow on Whatsapp

READ  OTT లో రానున్న ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories