Homeసినిమా వార్తలుఅయితే తొలి రోజునే ఫట్ - లేదా మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్.. టాలీవుడ్ లేటెస్ట్...

అయితే తొలి రోజునే ఫట్ – లేదా మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్.. టాలీవుడ్ లేటెస్ట్ ట్రెండ్

- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. గతంలో యూత్ లవ్ స్టోరీలు మాత్రమే హిట్ అయ్యేవి.. ఆ తరువాత ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ నడిచింది. మరికొన్ని రోజులు ఓకే ఒంట్లో హీరో – విలన్ ఉండే కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ల ట్రెండ్ నడిచాయి. అయితే కరోనా వేవ్ ల వరుస దాడి తరువాత ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చింది. ఓటిటి ప్లాట్‌ఫారమ్‌ల ఎదుగుదల కారణంగా, ప్రేక్షకులు తమ ఇంట్లోనే వినోదానికి అలవాటు పడ్డారు. అలాంటిది వారిని ఇళ్లలో నుండి బయటకు వచ్చి థియేటర్‌లకు రావాలి అంటే అందుకు తగిన ఆసక్తికరమైన అంశాలు ఉంటేనే అది సాధ్య పడుతుంది.

భారీ బడ్జెట్ చిత్రాలు లేదా స్టార్ హీరోల సినిమాలు భారీ హైప్ తో విడుదలవుతాయి కాబట్టి ఏదో ఒక విధంగా ఆయా సినిమాలు తమ పెట్టుబడిని కొంచెమైనా ఓపెనింగ్స్ రూపంలో రాబట్టుకుంటాయి. కానీ చిన్న సినిమాలు మీడియం బడ్జెట్ సినిమాలు అయితే సూపర్ డుపర్ హిట్ లేదా డిజాస్టర్లు అవుతున్నాయి. కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలు మొదటి రోజునే అట్టర్ ఫ్లాప్ అవుతుంటే, మరి కొన్ని సినిమాలు మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ సాధిస్తున్నాయి.

చిన్న సినిమాలకు బడ్జెట్ చాలా తక్కువ కాబట్టి, థియేట్రికల్ బిజినెస్ కూడా అందరికీ కాస్త అందుబాటులోనే ఉండేలా జరుపుకుంటారు. అందువల్ల సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ మార్క్ సాధించడం సులువే. కానీ, అవే సినిమాలకు టాక్ సరిగా రాకపోతే మాత్రం మొదటి రోజునే చతికిలబడతాయి. ఎందుకంటే ఆ సినిమాల్లో స్టార్‌ హీరోలు ఉండరు కాబట్టి.. ఇలాంటి కారణాల వల్ల మీడియం బడ్జెట్ సినిమాలు ఖచ్చితమైన ఓపెనింగ్స్ ను సాధించడం అన్ని సార్లు జరగదు.

READ  OTT - ది గ్రే మ్యాన్ రివ్యూ

అందుకు ఇటీవల విడుదలైన బింబిసార మరియు సీతా రామం సినిమాల విజయాలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 3వ రోజునే బింబిసార సినిమా బ్రేక్ ఈవెన్ కాగా.. సీతా రామం సినిమా తొలి రోజు కాస్త తక్కువ కలెక్షన్లు వచ్చినా.. తరువాత రోజు నుండి బాక్స్ ఆఫీసు వద్ద అలా ఎదుగుతూ ఇప్పుడు వారం రోజుల తరువాత కూడా తన హవాను కొనసాగిస్తోంది. ఇటీవ‌ల విడుద‌లైన కార్తికేయ 2 కూడా అద్భుతమైన వసూళ్లు వసూలు చేస్తోంది. 3 రోజులకే దాదాపు బ్రేక్ ఈవెన్ మార్క్ ను దాటేసిన ఈ సినిమా బాలీవుడ్ లోనూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది.

పైన ఉదాహరించిన సినిమాల ఫలితాలకు పూర్తి భిన్నంగా థ్యాంక్యూ, రామారావు ఆన్ డ్యూటీ, మాచర్ల నియోజకవర్గం వంటి సినిమాలు తొలిరోజే డిజాస్టర్లుగా నిలిచాయి. మాచర్ల మరియు రామారావు ఆన్ డ్యూటీకి కనీసం ఓపెనింగ్ డే కలెక్షన్స్ అయినా కాస్త పరవాలేదు అనేలా వచ్చాయి కానీ థాంక్యూ సినిమా తొలి రోజునే దారుణంగా పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

READ  నా సినిమా ఆరు నెలల వరకు ఓటిటిలో రాదు - Amir Khan

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories