Homeసినిమా వార్తలుUstaad Bhagat Singh: ఎట్టకేలకు మొదలైన పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్

Ustaad Bhagat Singh: ఎట్టకేలకు మొదలైన పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ఎట్టకేలకు ప్రారంభమైంది. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ రోజు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైందని హరీష్ శంకర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ‘ ఎన్నాళ్ళో వేచిన ఉదయం’ వీడియో సాంగ్ ను షేర్ చేయడం విశేషం. ఈరోజు అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి చాలా కాలం ఎదురు చేయాల్సి రావడంతో హరీష్ శంకర్ ఎంతో ఆనందంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. చాలా రోజుల క్రితం పవన్ తో భవధీయుడు భగత్ సింగ్ ను ప్రకటించారు హరీష్. అయితే ఆ టైటిల్, సబ్జెక్ట్ మారడంతో ఈ సినిమాకు ఉస్తాద్ భగత్ సింగ్ అనే కొత్త టైటిల్ పెట్టారు.

తమిళ చిత్రం తెరికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులు చేశారట. నిజానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, ఇతర తటస్థ ప్రేక్షకులు కూడా ఈ రీమేక్ తో అస్సలు సుముఖంగా లేరు. అయితే హరీష్ శంకర్ అండ్ టీం మాత్రం ఇదొక రీమేక్ సినిమా అని ప్రేక్షకులు మర్చిపోయేలా సినిమాలో చాలా మార్పులు చేశారనే నమ్మకంతో ఉన్నారు.

READ  Waltair Veerayya: చిరంజీవి కెరీర్‌లో అత్యంత లాభదాయకమైన సినిమాగా నిలిచిన వాల్తేరు వీరయ్య

ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు రాగా, దీని పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories