Homeసినిమా వార్తలుమహేష్ సినిమా పై పెదవి విప్పిన రాజమౌళి

మహేష్ సినిమా పై పెదవి విప్పిన రాజమౌళి

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకధిర ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రాబోయే సినిమా యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఆర్ ఆర్ ఆర్ వంటి భారీ ప్యాన్ ఇండియా ఘనవిజయం తర్వాత, రాజమౌళి పేరు దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మారు మ్రోగిపోయింది.

ఇక మహేష్ తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ప్యాన్-ఇండియా సినిమా చేయనప్పటికీ, దేశవ్యాప్తంగా ఆయనకు ఉన్న ప్రజాదరణ మరియు స్టార్డం ఏ ప్యాన్-ఇండియా స్టార్‌ల కంటే కూడా తక్కువ కాదనే చెప్పాలి. ఇక ప్రేక్షకులు మాత్రం మహేష్ – రాజమౌళి సినిమా ప్రకటించిన రోజునుండి ఈ సినిమా మీద చాలా ఆసక్తిగా ఉన్నారు. అయితే రాజమౌళి-మహేష్ బాబు ప్రాజెక్ట్ ప్రారంభం కావడానికి కొంత సమయం అయితే పడుతుంది. ఇక ఇలాంటి భారీ మరియు ఆసక్తికరమైన ప్రాజెక్ట్ పై పుకార్లు పుట్టడం మామూలే. ఇప్పటికే ఈ చిత్రం పై అనేక రూమర్లు మరియు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

కాగా ఇటీవలే జరిగిన ఒక ఈవెంట్‌లో, రాజమౌళి తన సినిమా నుండి ఏమి ఆశించాలో పరోక్షంగా ప్రేక్షకులకు సూచించారు. మహేష్‌తో తను తదుపరి చేయబోయే చిత్రం మొత్తం ప్రపంచాన్ని కదిలించే యాక్షన్ అడ్వెంచర్‌గా ఉంటుందని రాజమౌళి అన్నారు. మామూలుగా ఆయన మహేష్ తో సినిమా చేస్తున్నారు అంటేనే ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకుంటారు. ఇక స్వయంగా రాజమౌళి నుంచి ఇలాంటి భారీ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ అంచనాలను మరింతగా పెంచిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటు ప్రేక్షకులు ఇటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ కాంబినేషన్‌ని చూడటానికి.. ఆర్ ఆర్ ఆర్ సినిమాని ప్రపంచవ్యాప్తంగా చూసి ఆనందించి ఇతర దేశాల సినీ ప్రేమికులు కూడా అమితమైన ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

READ  ఎన్టీఆర్ 30 పై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టిన కళ్యాణ్ రామ్

ఇక హీరో మహేష్ బాబు తాజాగా తన తదుపరి ప్రాజెక్ట్ అయిన SSMB 28 సినిమా షూట్‌ను ప్రారంభించారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 28 ఏప్రిల్, 2023న విడుదల కానుంది. షూటింగ్ స్టార్ట్ చేసిన సందర్భంగా ఒక చిన్న విడియో గ్లింప్స్ ను విడుదల చేసారు చిత్ర బృందం.

Follow on Google News Follow on Whatsapp

READ  బుల్లితెర పై RRR Vs KGF 2


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories