కొరటాల శివ దర్శకత్వంలో తమ అభిమాన హీరో చేయబోయే ఎన్టీఆర్ 30 నుంచి ఏదో ఒక విషయం తెలుసుకోవాలని ఎన్టీఆర్ అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. అయితే చాలా కాలం నిరీక్షణ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ నుంచి వారికి శుభవార్త అందింది.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ తన నెక్ట్స్ మూవీని ఇంకా స్టార్ట్ చేయలేదు. కొరటాల శివతో ఆయన తదుపరి చేయబోయే చిత్ర బృందం సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే సినిమాకి సంభందించిన పనులు ఆలస్యమవడంతో ఎన్టీఆర్ అభిమానులు కలత చెంది ఎప్పటికప్పుడు ప్రొడక్షన్ యూనిట్ నుంచి అప్డేట్స్ అడగడం మొదలుపెట్టారు. అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఈ విషయం గురించి మాట్లాడారు.
తన వ్యాఖ్యలను చెడుగా తీసుకోవద్దని అభిమానులను కోరుతున్నానని ఎన్టీఆర్ తెలిపారు. ఒక సినిమా చేసేటప్పుడు ప్రతి గంటకు, రోజుకు అప్డేట్స్ ఇవ్వడం సాధ్యం కాదని ఎన్టీఆర్ అన్నారు. అభిమానులు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఆశించడం సమంజసం కాదని ఆర్ఆర్ఆర్ స్టార్ అన్నారు.
అభిమానుల అభిరుచి, ఉత్సాహం తాను అర్థం చేసుకోగలనని ఎన్టీఆర్ అన్నారు. అయితే వారి ప్రవర్తన ఒక్కోసారి నిర్మాతలు, దర్శకుల పై ఒత్తిడి పెంచుతోందని ఎన్టీఆర్ వివరించారు. ఒక అప్డేట్ ను ప్రేక్షకులతో పంచుకోవడానికి అది ఎంతో సమర్థవంతంగా ఉండాలని ఆయన తెలిపారు.
ఈరోజు ప్రతి సినిమా యూనిట్ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిపిన ఎన్టీఆర్.. ఏదైనా అప్డేట్ వస్తే తమ కుటుంబసభ్యుల కంటే ముందుగా ప్రేక్షకులతో పంచుకుంటామని ఎన్టీఆర్ అన్నారు. ఇతర ఆర్టిస్టుల పక్షాన కూడా తాను ఈ మాట మాట్లాడుతున్నానని ఎన్టీఆర్ మరోసారి వివరణ ఇచ్చారు.
2023 ఫిబ్రవరిలో ఎన్టీఆర్ 30 యొక్క పూజా కార్యక్రమాలు ఉంటాయని, మార్చి 20 లేదా అంతకంటే ముందే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని ఎన్టీఆర్ అధికారికంగా ధృవీకరించారు. అలాగే ముందుగా ప్రకటించినట్లుగానే 2024 ఏప్రిల్ 5న ఎన్టీఆర్ 30 విడుదల కానుందని భరోసా ఇచ్చారు.