సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న SSMB28 సినిమా ఇటీవలే విడుదల తేదీని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 28 ఏప్రిల్ 2023న విడుదల కానుంది. చిత్ర బృందం ఈ భారీ అప్‌డేట్‌ను కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ప్రకటించారు. మహేష్ బాబు ఇండస్ట్రీ హిట్ పోకిరి డేట్ కే ఈ సినిమా కూడా రానుందనే వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇక తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు సంబందించిన సమాచారం వచ్చింది. SSMB28 సెప్టెంబర్ 8వ తారీఖు నుండి రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభిస్తుంది. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం 13వ తేదీ నుండి షూటింగ్ లో పాలు పంచుకుంటారట. అలాగే ఈ షెడ్యూల్‌లో కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా.. మిగిలిన నటీనటుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. తాజాగా, ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో త్రివిక్రమ్ భారీ విజయాన్ని అందుకున్నారు. అంతే కాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ప్రేక్షకులు ప్రధానంగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లనే ఆశిస్తారు. అయితే ఈసారి ఫ్యామిలీ సబ్జెక్ట్ కాదని, ఎంచుకున్న జానర్‌తో పాటు సబ్జెక్ట్‌కి సంబంధించిన ట్రీట్‌మెంట్ కూడా ఎంతో భిన్నంగా ఉంటుందని మహేష్ స్పష్టం చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు రొటీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అంటే ఏమాత్రం ఆసక్తి చూపించట్లేదు.
SSMB28 సినిమాతో 12 సంవత్సరాల తర్వాత ఈ మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో సినిమా రాబోతుంది. అతడు, ఖలేజా తర్వాత మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ల కలయికలో ఇది మూడో సినిమా. చిత్ర నిర్మాతలు, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ గత సంవత్సరం ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించి అభిమానులను ఆనందపరిచారు ఈ చిత్రానికి ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.