Home సినిమా వార్తలు Finally Keerthy Suresh Opensup about Her Lovestory ఫైనల్ గా తన లవ్ స్టోరీ...

Finally Keerthy Suresh Opensup about Her Lovestory ఫైనల్ గా తన లవ్ స్టోరీ పై స్పందించిన కీర్తి సురేష్

keerthy suresh

టాలీవుడ్ స్టార్ కథానాయకల్లో ఒకరైన కీర్తి సురేష్ ప్రస్తుతం కెరిర్ పరంగా వరుస సినిమాలతో కొనసాగుతున్నారు. తొలిసారిగా నేను శైలజ సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ తాజాగా హిందీ సినిమా పరిశ్రమలో కూడా బేబీ జాన్ మూవీ ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తుండగా ఇటీవల అట్లీ తెరకెక్కించిన తేరి మూవీకి ఇది అఫీషియల్ రీమేక్ గా రూపొందుతుంది.

అసలు విషయం ఏమిటంటే 15 ఏళ్లుగా తనతో మంచి స్నేహానుబంధం కలిగిన స్నేహితుడైన అంటోనీని కీర్తి సురేష్ డిసెంబర్ 11న గ్రాండ్ గా వివాహం చేసుకోబోతున్నారు అనే వార్తలు కొద్ది రోజులుగా మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి. కాగా తాజాగా వాటిని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు కీర్తి సురేష్. తామద్దరి మధ్య అనుబంధం ఉందనేటువంటి దానికి సూచనగా ఆంటోనీతో కలిసి వెనుకవైపు నుండి దిగిన ఒక ఫోటోని తన సోషల్ మీడియా మాధ్యమాల్లో పంచుకున్నారు కీర్తి సురేష్.

ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనితో కీర్తి, ఆంటోనీ లవ్ స్టోరీ, వివాహం ఫిక్స్ అని తెలుస్తోంది. అయితే వీరిద్దరి వివాహం పక్కాగా ఏరోజున జరుగుతుంది అనే దానిపై వారి నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సిందే. మొత్తంగా తమ అభిమాన కథానాయిక వివాహం త్వరలో జరగబోతుండటంతో కీర్తి సురేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ ముందస్తుగా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కీర్తి మరియు ఆంటోనీకి వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version