Homeసినిమా వార్తలుఆదిపురుష్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్

ఆదిపురుష్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా షూటింగ్ ముగిసి చాలా నెలలు అవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నారు. కాగా మోషన్ గ్రాఫిక్స్ వర్క్ కు కాస్త ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లుగా చాలా రోజులుగా సమాచారం అందుతోంది. ఈ సినిమా విడుదల వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యేలా చిత్ర బృందం అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది.

అయితే ఈ సినిమా యూనిట్ పై ప్రభాస్ అభిమానులు చాలా రోజులుగా కోపంతో ఉన్నారు. అందుకు కారణం లేకపోలేదు. గత రెండేళ్లుగా ఈ సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ కోసం ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తునే ఉన్నారు. కానీ సినిమా విడుదలకు చాలా సమయం ఉందంటూ ఫస్ట్ లుక్ మరియు టీజర్ విడుదలను ఇన్ని రోజుల వరకూ దర్శకుడు ఓమ్ రౌత్ వాయిదా వేస్తూ వచ్చారు. సినిమా నుంచి కనీసం ఒక పోస్టర్ అయినా విడుదల చేయలేదు అని ప్రభాస్ అభిమానులు చాలా అసహనంతో ఉన్నారు.

ఐతే ఎట్టకేలకు యంగ్ రెబల్ స్టార్ అభిమానులకు ఒక పెద్ద శుభవార్త రాబోతోంది. ఆదిపురుష్ టీజర్‌ను అక్టోబర్ 3వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అలాగే టీజర్ రిలీజ్ నుంచి జనవరి 12న సినిమా రిలీజ్ అయ్యే వరకు ప్రచార కార్యక్రమాలు విస్తృత స్థాయిలో జరుగుతాయని కూడా ప్రకటించారు.

READ  మోహన్ లాల్ లూసిఫర్ సీక్వెల్ డిటైల్స్

ఇదిలా ఉండగా.. ఈ సారి ఢిల్లీలో రావణ దహన కార్యక్రమాన్ని ప్రభాస్ చేతుల మీదుగా జరిపించాలని ఇప్పటికే ఆయనకు ఆహ్వానం కూడా అందింది. రామాయణాన్ని ఆధారంగా చేసుకొని దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్‌ సినిమాను తెరకెక్కించారు. శ్రీరాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రాన్ని భారీ ప్యాన్ ఇండియా సినిమా లాగా మాత్రమే కాకుండా.. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో చూడని విజువల్ ఎఫెక్ట్స్ ఇందులో చూపించనున్నట్లు దర్శకుడు ఓం రౌత్ ప్రకటించారు. ఆదిపురుష్ టీజర్ సెప్టెంబర్ చివరి వారంలో రిలీజ్ అవనుందని ఇటీవలే కొందరు పుకార్లు పుట్టించారు. అయితే అక్టోబర్ 3నే టీజర్ రిలీజ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. శ్రీరాముడిగా ప్రభాస్‌ను తప్ప మరే హీరోను ఊహించుకోలేనని దర్శకుడు ఓం రౌత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Follow on Google News Follow on Whatsapp

READ  రేపే ప్రభాస్ - మారుతి సినిమా పూజా కార్యక్రమం


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories