Homeసినిమా వార్తలుతెలుగు రాష్ట్రాలలో కూడా బాబా సినిమాను రిలీజ్ చేయాలని కోరుతున్న రజినీకాంత్ ఫ్యాన్స్

తెలుగు రాష్ట్రాలలో కూడా బాబా సినిమాను రిలీజ్ చేయాలని కోరుతున్న రజినీకాంత్ ఫ్యాన్స్

- Advertisement -

సూపర్ స్టార్ రజినీకాంత్ స్వయంగా రచించి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఆధ్యాత్మిక చిత్రం బాబా. ఈ చిత్రం 2002లో విడుదలై ఆ సమయంలో భారీ డిజాస్టర్ గా నిలిచింది.

బాబా డైలాగ్స్ మరియు క్యారెక్టర్ తో పాటు ఎ.ఆర్.రెహమాన్ అందించిన సంగీతం ప్రేక్షకులకు నచ్చినప్పటికీ, విడుదలైన తర్వాత భారీ అంచనాలను అందుకొని కారణంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. సినిమా కథలో క్లారిటీ లోపించిందని జనాలు భావించారు. అయితే పైన చెప్పినట్లుగా కొన్ని వర్గాల ప్రేక్షకులు ఇప్పటికీ ఈ చిత్రాన్ని ఇష్టపడతారు.

ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద భక్తి వాతావరణం ఉందని బాబా టీం విశ్వసిస్తోంది. ‘కాంతార’, ‘అఖండ’, ‘కార్తికేయ 2’ లాంటి భక్తి నేపథ్యం ఉన్న సినిమాలు పెద్ద హిట్స్ కావడం మనం చూశాం. రజినీకాంత్ కూడా కాంతార సినిమా చూసి రిషబ్ శెట్టిని ప్రశంసించారు.

బాబా సినిమా తెలుగులో కాకుండా తమిళంలోనే రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఉన్న రజినీకాంత్ అభిమానులు కూడా తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను రీ రిలీజ్ చేయాలని అడుగుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కు తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే.

బాబా మూవీ విజువల్ గా అప్ గ్రేడ్ చేయబడింది మరియు ఆడియో డాల్బీగా మార్చబడింది. కొన్ని సన్నివేశాలకు రజినీకాంత్ మళ్లీ డబ్బింగ్ కూడా చెప్పారు. సినిమా నిడివిని ఒక 30 నిమిషాలు కత్తిరించి ఎడిటింగ్ చేశారు. ఈసారి పదునైన ఎడిటింగ్ తో బాబా సినిమా కొత్త వెర్షన్ ను ప్రేక్షకులు చూడవచ్చు.

READ  భారతీయ సినిమా చరిత్రలోనే అతి పెద్ద రిలీజ్ గా నిలవనున్న రజినీకాంత్ బాబా
Superstar Rajinikanth Baba re-release trailer

అందుకే బాబా మానియాను తాము కూడా చూసి ఆనందించాలని తెలుగు ప్రేక్షకులు కూడా ఆయన పుట్టిన రోజైన డిసెంబర్ 12న గ్రాండ్ రిలీజ్ చేయాలని కోరుతున్నారు. మరి నిర్మాతలు బాబా సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తారో లేదో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories