తెలుగు స్టార్ హీరోల అభిమానులు ఎప్పుడూ తమ హీరోలు మంచి కంటెంట్ తో సినిమాలను అనుకున్న సమయానికి విడుదల చేయాలని కోరుకుంటారు. ఇక తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుల్లో ఒకరైన సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా హిట్లు కొడుతున్నారు. అయితే ఈ మధ్య ఆయన ఇచ్చిన హిట్స్ లో పెద్దగా స్ట్రాంగ్ కంటెంట్ లేకపోవడం, ఫార్ములా ఎలిమెంట్స్ ఉన్న మూస తరహా సినిమాల లాగా ఉండటంతో అభిమానులు మహేష్ అభిమానులు ఏమాత్రం సంతోషంగా లేరు.
ఆ తరువాత తమ అభిమాన హీరో తదుపరి చిత్రాలకు త్రివిక్రమ్, రాజమౌళి వంటి పెద్ద దర్శకులతో పనిచేస్తుండటంతో మహేష్ అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. మొదట త్రివిక్రమ్ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ పనుల్లో జాప్యం కారణంగా ఈ ప్రాజెక్ట్ ను ఆగష్టుకు మార్చారు, మళ్ళీ కొంత జాప్యం, స్క్రిప్ట్ మార్పులతో SSMB28 సినిమా మళ్ళీ సంక్రాంతికి వాయిదా పడింది. ఈ వార్తతో మహేష్ బాబు అభిమానులు ఆనందంలో మునిగిపోయారు మరియు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సాధించడానికి సహాయపడుతుంది కాబట్టి సంక్రాంతి సీజన్ లోనే విడుదల చేయాలని కోరుకున్నారు.
అయితే సంక్రాంతికి సినిమా విడుదల తేదీని ప్రకటించిన తర్వాత మహేష్ రిలాక్స్ అయి షూటింగ్స్ నుంచి లాంగ్ గ్యాప్ తీసుకుంటూ ఫ్యామిలీ వెకేషన్స్ తో గడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి గ్యాప్ ల వల్ల SSMB28 తర్వాత మహేష్ బాబు కమిట్ అయిన రాజమౌళి సినిమా ప్రీ ప్రొడక్షన్ టైమ్ పై ఈ జాప్యం ప్రభావం చూపుతుందనే భావనలో మహేష్ వైఖరి అభిమానులకు రుచించడం లేదు.
అయితే SSMB 28 సినిమా విడుదలకు ఇంకా 7 నెలల సమయం ఉన్నందున మహేష్ బాబు అభిమానులు మహేష్ కార్యకలాపాల పై ఓవర్ రియాక్ట్ అవుతున్నారని అనచ్చు. అంత సమయం ఉన్నందున మహేష్ బాబు కాస్త గ్యాప్ తీసుకుంటే కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు. మహేష్ బాబుకు ప్రతి ఏడాది వేసవిలో ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లడం అలవాటు.