Homeసినిమా వార్తలుతన మంచి మనసుని మరోసారి చాటుకున్న ప్రభాస్

తన మంచి మనసుని మరోసారి చాటుకున్న ప్రభాస్

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్థానం ప్రత్యేకం. నటుడిగా, స్టార్ హీరోగా ఎలా ఐతే ఒక్కో మెట్టూ ఎదిగాడో, మంచి మనిషిగా కూడా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఒకప్పుడు వర్ధమాన నటుడుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో, బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తర్వాత కూడా తన ప్రవర్తనలో ఎలాంటి మార్పూ లేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే నానుడికి అద్దం పట్టే విధంగా ప్రభాస్ ప్రవర్తన ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

తాజాగా ప్రభాస్ పెదనాన్న, తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నటుడు మరియు సీనియర్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించిన విషయం తెలిసిందే. అయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. అలాగే తన తండ్రి తర్వాత తండ్రి లాంటి మనిషిని కోల్పోవడం ప్రభాస్ కు కూడా చాలా బాధాకరమైన విషయం. అయితే అంత బాధలోనూ.. కృష్ణంరాజు భౌతిక కాయాన్ని సందర్శించేందుకు వచ్చిన తన అభిమానులకు భోజనం ఏర్పాటు చేసి అందరి మనసులని గెలుచుకున్నారు ప్రభాస్. తాజాగా మరోసారి ప్రభాస్ అలాంటి ప్రవర్తనతో అందరి ఆదరణను చూరగొన్నారు.

రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు సంస్మ‌ర‌ణ స‌భ సంద‌ర్భంగా 12 ఏళ్ల త‌ర్వాత ప్యాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, తన సొంత ఊరు అయిన మొగల్తూరు కి వెళ్ళారు. ఈ విషయం విన్న స్థానికులు మరియు ప్రభాస్ అభిమానులు ఆయన ఇంటి వ‌ద్ద‌కు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ప్ర‌భాస్ వ‌స్తున్నారన్న వార్త ఒక్కసారిగా అందరిలోనూ మారు మ్రోగింది. కేవలం స్థానికులే కాక చుట్టు పక్కన ఉన్న గ్రామస్థులు ప్రభాస్ కంటే ముందుగానే ఆయన నివాస స‌మీప ప్రాంతానికి చేరుకోవడం విశేషం.

READ  పవన్ - మహేష్ రికార్డులను ప్రభాస్ దాటగలడా?

ఇలా ఒక భారీ జన సందోహం ప్ర‌భాస్ ని చూసేందుకు వెళ్లారు. తాజాగా ప్ర‌భాస్ ఇంటి నుంచి ప్రేక్ష‌కాభిమానుల‌కు అభివాదం చేస్తోన్న ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ప్ర‌భాస్ ని చూడ‌గానే అభిమానులు ఈల‌లు.. కేరింత‌ల‌కి అడ్డే లేకుండా పోయింది. ఆ త‌ర్వాత కృష్ణంరాజు భార్య‌..పెద్ద‌మ్మ శ్యామ‌లా దేవి అభిమానుల‌కు అభివాదం చేసారు. ఈ క్ర‌మంలోనే శ్యామ‌లా దేవి క‌న్నీటి ప‌ర్యంతం చెందారు.

ఇక అభిమానుల కోసం ప్ర‌భాస్ భారీ స్థాయిలో విందుని ఏర్పాటు చేశారు. నోరూరించే వంట‌కాలు చేశారు. ఏకంగా ల‌క్ష మందికి వెజ్-నాన్ వెజ్ వంట‌కాలను తయారు చేయడం విశేషం.

6 టన్నుల మటన్ కర్రీ , 6 టన్నుల బిర్యానీ మటన్, 1 టన్ను రొయ్యల గోంగూర ఇగురు, 1 టన్ను రొయ్యల ఇగురు,1 టన్ను స్టఫ్డ్ క్రాబ్, 1 టన్ను బొమ్మిడాయల పులుసు , 6 టన్నుల చికెన్ కర్రీ, 4 టన్నుల చికెన్ ఫ్రై, 6 టన్నుల చికెన్ బిర్యానీ, 1 టన్ను పండుగప్ప కర్రీ, 4 టన్నుల చందువా ఫిష్ ఫ్రై వంటి వంటకాలు ఆ భోజనం లిస్ట్ లో ఉన్నాయి.

ఇలా దాదాపు 20 ర‌కాల ప్ర‌త్యేక వంట‌కాలు అభిమానుల‌కు రుచి చూపించిన‌ట్లు తెలుస్తోంది. త‌మ సంప్ర‌దాయ ప్ర‌కారం సంస్మ‌ర‌ణ స‌భ‌ని ఎంతో ఘ‌నంగా నిర్వ‌హించిన‌ట్లు తెలుస్తోంది. ఇది తెలిసిన వారంతా ప్రభాస్ ఈ స్థాయిలో భోజనాన్ని ఏర్పాటు చేయడం చూసి ఆశ్చర్య పోవడంతో పాటు ఎంతగానో పొగిడారు.

READ  మారుతి తో సినిమా పై ఆందోళనలో ఉన్న ప్రభాస్ అభిమానులు

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories