మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొంది ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చిన మూవీ లూసిఫర్. అయితే మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లో పెద్ద విజయం సొంతం చేసుకుంది.
ఆ మూవీతో దర్శకుడిగా పృథ్వీరాజ్ మరింత క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఆంతరం అదే మూవీని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా గాడ్ ఫాదర్ టైటిల్ తో రీమేక్ చేయగా యావరేజ్ విజయం సొంతం చేసుకుంది. ఇక తాజాగా దానికి సీక్వెల్ అయిన ఎంపురాన్ మూవీ తెరకెక్కించారు పృథ్వీరాజ్.
ఈ మూవీలో మోహన్ లాల్ పాత్ర మరింత పవర్ఫుల్ గా ఉండనుందట. విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. ముఖ్యంగా ట్రైలర్, థ్రిల్లింగ్ యాక్షన్ అంశాలతో అదిరిపోయే విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. ట్రైలర్ లో మోహన్ లాల్, పృథ్వీరాజ్ ల లుక్స్ తో పాటు డైలాగ్స్ కూడా బాగున్నాయి.
మొత్తంగా ఎంపురాన్ ట్రైలర్ మూవీ పై అమాంతంగా అంచనాలు పెంచేసిందని చెప్పాలి. ఇప్పటికే ఈ మూవీ యొక్క అడ్వాన్స్ బుకింగ్స్ రు. 10 కోట్లని దాటేశాయి. మార్చి 27న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి.