మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఎంపురాన్. ఈమూవీలో అభిమన్యు సింగ్, మంజు వారియర్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించగా ఆశీర్వాద్ సినిమాస్, లైకా ప్రొడక్షన్స్,
శ్రీ గోకులం మూవీస్ సంస్థలు దీనిని గ్రాండ్ గా నిర్మించాయి.
దీపక్ దేవ్ సంగీతం అందించిన ఈ మూవీకి సుజీత్ వాసుదేవ్ ఫోటోగ్రఫి అందించారు. ఇక ఇటీవల మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈమూవీ మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. మరొక్కసారి తన ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో మోహన్ లాల్ ఆకట్టుకున్నప్పటికీ కథ, కథనాలు ఏమాత్రం ఆశించిన రీతిన లేకపోవడంతో పలు ఏరియాల్లో నెగటివ్ టాక్ సంపాదించింది ఎంపురాన్.
అయినప్పటికీ కేరళ సహా పలు ప్రాంతాల్లో ఈ మూవీ టాక్ తో సంబంధం లేకుండా ఫస్ట్ వీక్ బాగా కలెక్షన్ రాబట్టింది. మొత్తంగా 9 రోజుల్లో రూ. 240 కోట్లు గ్రాస్ రాబట్టిన ఈ మూవీ ఇవాళ్టితో రూ. 250 కోట్లకి చేరుకోనుంది. కాగా కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఎంపురాన్ కలెక్షన్స్ రెండవ వారం నుండి బాగా తగ్గిపోయాయి. ఈ ట్రెండ్ ని బట్టి చూస్తుంటే ఈ మూవీ ఓవరాల్ గా రూ. 300 కోట్ల లోపే క్లోజ్ అయ్యే అవకాశం కనపడుతోందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.