సినిమా పేరు: L2: ఎంపురాన్
రేటింగ్: 2.5/5
తారాగణం: మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, మంజు వారియర్, అభిమన్యు సింగ్ మరియు సూరజ్ వెంజరమూడు
దర్శకుడు: పృథ్వీరాజ్ సుకుమారన్
నిర్మాతలు: ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ మరియు లైకా ప్రొడక్షన్స్
విడుదల తేదీ: 27 మార్చి 2025
ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద విజయం అందుకున్న యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ లూసిఫర్. అనంతరం దానికి సీక్వెల్ గా ఎంపురాన్ మూవీని అనౌన్స్ చేసారు. కాగా ఫస్ట్ పార్ట్ ని మించేలా దీనిని మరింత గ్రాండియర్ గా తెరకెక్కించనున్నట్లు అప్పట్లో మేకర్స్ తెలిపారు.
పృథ్వీరాజ్ సుకుమారన్ తీసిన ఈ మూవీలో మోహన్ లాల్ కీలక పాత్ర చేసారు. కాగా నేడు ఎన్నో అంచనాల నడుమ ఎంపురాన్ మూవీ పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి దీని యొక్క పూర్తి రివ్యూ ఇప్పుడు చూద్దాం.
కథ :
కేరళ రాజకీయాల్లో సరికొత్త సంచలనం సృష్టించేందుకు జతిన్ రామ్ దాస్ (టోవినో థామస్)
బాబా బజరంగీ, బాల్రాజ్ పటేల్ నేతృత్వంలోని కరుడుగట్టిన మితవాద ASAతో కలిసి కొత్త పార్టీని స్థాపిస్తాడు. అయితే స్టీఫెన్ నెడుంపల్లి సొంత దేశం మరియు రాష్ట్రాన్ని జతిన్ కుట్రలు కుతంత్రాల నుండి ఏవిధంగా కాపాడాడు అనేది మొత్తం మిగతా కథ. అది అంతా మనం సినిమాలో చూడాల్సిందే.
నటీనటుల పెర్ఫార్మన్స్ :
స్టీఫెన్ పాత్రలో మరొకసారి సూపర్ గా యాక్ట్ చేసారు మోహన్ లాల్. పలు కీలక యాక్షన్ సీన్స్ లో మరింత ఆకట్టుకున్నారు. ఇక జతిన్ రామ్ దాస్ పాత్రలో టోవినో పెర్ఫార్మన్స్ కూడా సూపర్. అనే చిత్ర దర్శకుడిగా మరోవైపు మరొక ముఖ్య పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. అలానే ఇతర కీలక పాత్రలు చేసిన అభిమన్యు సింగ్, ఇంద్రజిత్ సుకుమారన్ కూడా అలరించారు. అయితే కిషోర్ మరియు ఇతరులకు తక్కువ స్క్రీన్ టైం మాత్రమే దొరికింది.
విశ్లేషణ :
ముఖ్యంగా ఫస్ట్ పార్ట్ తో అందరినీ ఆకట్టుకున్న ఈ మూవీ ఇంట్రెస్టింగ్ గా మొదలవుతుంది. అయితే ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా చాలా డల్ గా సాగే మూవీ మోహన్ లాల్ ఎంట్రీ మరియు ఇంటర్వెల్ ఎపిసోడ్స్ తో పర్వాలేదనిపిస్తుంది.
అయితే ఆకట్టుకునే రీతిన ప్రారంభం అయ్యే సెకండ్ హాఫ్ కూడా ముందుకు సాగేకొద్దీ నిరాశపరుస్తుంది. విలన్ పాత్ర మరియు పలు సీన్స్ ఎంతో సింపుల్ గా అనిపిస్తాయి. ఏదో కావాలని తాడిపత్రి భాగం కోసం దీని యొక్క క్లైమాక్స్ రాసుకున్నారు అనిపిస్తుంది. దర్శకుడు పృథ్వీరాజ్ ఈ మూవీతో చాలా వరకు ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని నిరాశపరిచారు.
ప్లస్ పాయింట్స్ :
- రిచ్ విజువల్స్
- ప్రారంభ సన్నివేశం
- సెకండాఫ్‌లోని మొదటి 20 నిమిషాలు
మైనస్ పాయింట్స్ :
- డల్ టేకింగ్
- పాత్రలు / సబ్ ప్లాట్‌ల బలహీనమైన నిర్వహణ
- స్పష్టత లేని స్క్రీన్‌ప్లే
తీర్పు :
కాగా నేడు ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఎంపురాన్ మూవీ ఇంట్రడక్షన్ సీన్స్, ఇంటర్వెల్ ఎపిసోడ్స్, రిచ్ విజువల్స్ తప్ప దాదాపుగా సినిమా మొత్తం కూడా ఆడియన్స్ ని నిరాశపరుస్తుందని చెప్పాలి. పాత్రలు, సబ్ ప్లాట్ లు చాలా బలహీనంగా ఉండడంతో పాటు ఏమాత్రం అస్పష్టంగా ఉండే స్క్రీన్ ప్లే ఏమాత్రం ఆకట్టుకోదు. ఓవరాల్ గా ఎంపురాన్ మూవీ డిజప్పాయింట్ చేసింది.