మలయాళ నటుడు కం దర్శకుడు అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా అక్కడ స్టార్ యాక్టర్ మోహన్ లాల్ తో తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఎంపురాన్. మార్చి 27 న గ్రాండ్ లెవెల్ లో పలుభాషల ఆడియన్స్ ముందుకు రానుంది ఈ సినిమా. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో అందరిలో భారీ స్థాయి అంచనాలు ఏర్పరచిన ఎంపురాన్ మూవీకి ఓపెనింగ్స్ కూడా భారీ స్థాయిలో వస్తున్నాయి.
ముఖ్యంగా అంతకుముందు దీనికి ప్రథమ భాగం అయిన లూసిఫర్ అందరినీ విశేషంగా ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇక ఎంపురాన్ ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు తారా స్థాయికి చేరడంతో సినిమా బ్లాక్ బస్టర్ ఖాయమని అటు మలయాళ చిత్ర పరిశ్రమతో పాటు ఇతర చిత్ర పరిశ్రమల యొక్క ఆడియన్స్ కూడా క్యూరియాసిటీ వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమా ప్రస్తుతం ప్రీ బుకింగ్స్ సంబంధించి బ్లాక్ బస్టర్ రికార్డ్స్ నెలకొల్పుతోంది. తాజాగా ఈ సినిమా రూ. 58 కోట్లకు పైగా ఫ్రీ బుకింగ్స్ ని జరుపుకొని ఈ ఏడాది ఏ సినిమా కూడా అందుకోని ఒక అద్భుతమైన రికార్డు నెలకొల్పింది. తప్పకుండా తమ మూవీ అందరినీ ఆకట్టుకుని అంచనాలను మించేలా ఉంటుందని తాజాగా ఇంటర్వ్యూలో భాగంగా హీరో మోహన్ లాల్, దర్శకుడు పృథ్విరాజ్ సుకుమారన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక తెలుగులో కూడా ఈ సినిమాకి భారీ స్థాయిలో బుకింగ్స్ జరుగుతూ ఉండటం విశేషం. అటు ఓవర్సీస్ లో కూడా మంచి ఫ్రీ బుకింగ్స్ ని ఈ మూవీ అందుకుంటోంది. మరి అందరిలో ఈ రేంజ్ హైప్ ఏర్పరిచిన ఈ మూవీ రిలీజ్ అనంతరం ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.