ప్రస్తుతం మలయాళంలో మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఎంపురాన్. కొన్నేళ్ల క్రితం రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సొంతం చేసుకున్న లూసిఫర్ మూవీకి ఇది సీక్వెల్.
కాగా లూసిఫర్ మూవీ అప్పట్లో అతి పెద్ద విజయం సొంతం చేసుకుని మోహన్ లాల్, పృథ్వీ రాజ్ ల కాంబినేషన్ కి మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. దానితో అందరిలో ఎంపురాన్ పై తారా స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈమూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు అన్ని కూడా అందరినీ ఆకట్టుకున్నాయి.
పాన్ ఇండియన్ రేంజ్ లో పలు భాషల ఆడియన్స్ ముందుకి మార్చి 27న గ్రాండ్ గా రానుంది ఈమూవీ. ఇక తాజాగా ఎంపురాన్ యొక్క ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేయగా అవి అదరగొడుతున్నాయి. అటు కేరళలోనే కాక పలు ఇతర ప్రాంతాల్లో కూడా భారీ స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి. తెలుగులో కూడా గ్రాండ్ గా రిలీజ్ కి రెడీ అయిన ఈమూవీ హైదరాబాద్ బుకింగ్స్ కూడా అదరగొడుతోంది.
విషయం ఏమిటంటే ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో లో ఈ మూవీ తాజాగా ప్రీ బుకింగ్స్ విషయంలో ఆల్ ఇండియన్ రికార్డు నెలకొల్పింది. కాగా ఒక గంటలో 96.14 K ప్రీ బుకింగ్స్ జరుపుకున్న మూవీగా ఇది సంచలనం సృష్టించింది. దీనితో అందరిలో ఎంపురాన్ మూవీ పై ఏస్థాయిలో అంచనాలు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.
ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్, లైకా ప్రొడక్షన్స్ భారీ లెవెల్లో నిర్మించిన ఈమూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, అభిమన్యు సింగ్ తదితరులు ముఖ్య పాత్రలు చేయగా దీపక్ దేవ్ సంగీతం సమకూర్చారు