తన పెదనాన్న కృష్ణంరాజు నటవారసుడిగా తొలిసారిగా జయంత్ సి పరాన్జీ 2002లో తెరకెక్కించిన ఈశ్వర్ మూవీ ద్వారా హీరోగా ఆడియన్స్ ముందుకి వచ్చారు ప్రభాస్. అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాగానే విజయం సొంతం చేసుకుంది.
దివంగత ప్రముఖ సీనియర్ నటి మంజుల కుమార్తె శ్రీదేవి హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో శివకృష్ణ, అశోక్ కుమార్, రేవతి, బ్రహ్మానందం తదితరులుకీలక పాత్రలు చేసారు. అయితే విషయం ఏమిటంటే, తాజాగా నారా రోహిత్ హీరోగా తెరకెక్కుతున్న సుందరకాండ మూవీలో ఒక హీరోయిన్ గా నటిస్తున్న శ్రీదేవి, టీజర్ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ప్రభాస్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.
తొలి చిత్రం ఈశ్వర్ చేసేటపుడు ప్రభాస్ వైఖరి అప్పుడు ఎలా ఉందో, ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ గా ఎంతో గొప్ప స్థాయికి చేరుకున్నప్పటికీ అలానే ఉందన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ప్రభాస్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు కోరుకుంటున్నట్లు తెలిపారు. అలానే అవకాశం వస్తే ప్రభాస్ మళ్ళి కలిసి నటించేందుకు తాను సిద్దమన్నారు శ్రీదేవి. మరి ఆవిడ కోరిక ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి