ట్రాక్ టాలీవుడ్ ముందుగానే నివేదించినట్లుగా, నాని యొక్క తాజా పాన్-ఇండియా ప్రాజెక్ట్ దసరా సినిమా కోసం ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ షోలు నిర్ధారించబడ్డాయి. తొలిరోజు బాక్సాఫీస్ వద్ద ఊపందుకోవడానికి ఓపెనింగ్ టాక్ పై భారీగా నమ్మకం పెట్టుకున్న ఈ చిత్రానికి ఇది ఒక మంచి అవకాశంగా భావించవచ్చు. ఇక ఈ చిత్ర నిర్మాతలు మరియు నాని సినిమా సబ్జెక్ట్, వచ్చిన అవుట్‌పుట్‌పై చాలా నమ్మకంగా ఉన్నారు కాబట్టి ఎక్కువ షోలు నిర్వహించడం వారికి ఖచ్చితంగా ఉపయోగ పడుతుందనే చెప్పవచ్చు.
కాగా దసరా సినిమాకి అన్ని ప్రధాన ప్రాంతాలలో మొదటి రోజు 5 షోలను ప్రదర్శించడానికి చాలా కేంద్రాలు ఖరారు చేయబడ్డాయి. అలాగే మార్చి 29వ తేదీన ఎంపిక చేసిన స్క్రీన్‌లలో అర్ధరాత్రి ప్రీమియర్‌లను కూడా ప్రదర్శించడానికి మరియు ఆ తరువాతి మార్చి 30వ తారీఖున ఉదయం 5 గంటల నుండి పెద్ద హీరోల సినిమాల మల్లె ఎర్లీ మార్నింగ్ షోలను ఏర్పాటు చేసే ప్లాన్‌లో చిత్ర బృందం ఉంది.
ప్రస్తుతం నాని, కీర్తి సురేష్, శ్రీకాంత్ ఓదెలతోపాటు మిగతా నటీనటులు ఈ చిత్రానికి బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఈ సినిమాని గరిష్ట సంఖ్యలో ప్రేక్షకులకు చేరేలా చూసేందుకు చిత్ర బృందం తమ సర్వ శక్తులూ ధారబోస్తుంది.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీని అందించారు. ఈ చిత్రం యొక్క ప్రచార కంటెంట్, ముఖ్యంగా పోస్టర్లు అన్ని వర్గాల నుండి గొప్ప ప్రశంసలను అందుకున్నాయి మరియు ఇప్పుడు అందరి కళ్ళు ఈ సినిమా విడుదల తేదీ పైనే ఉన్నాయి.
ఈ చిత్రంలో నాని, కీర్తి సురేష్, ధీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వాహబ్, సాయి కుమార్ మరియు రాజశేఖర్ అనింగి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని మార్చి 30న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో థియేటర్లలో విడుదల చేయనున్నారు.