Home సినిమా వార్తలు మరోసారి బాక్సాఫీస్ వద్ద క్లాష్ కానున్న దుల్కర్ – శివ కార్తికేయన్ మూవీస్ 

మరోసారి బాక్సాఫీస్ వద్ద క్లాష్ కానున్న దుల్కర్ – శివ కార్తికేయన్ మూవీస్ 

tollywood latest news

ఇటీవల యువ నటులు శివ కార్తికేయన్, దుల్కర్ సల్మాన్ నటించిన అమరన్, లక్కీ భాస్కర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒకేసారి క్లాష్ కి వచ్చిన విషయం తెలిసిందే. గతేడాది దీపావళికి రిలీజ్ అయినా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సొంతం చేసుకున్నాయి.

అయితే వీరిలో లక్కి భాస్కర్ మూవీని వెంకీ అట్లూరి తెరకెక్కించగా అమరన్ మూవీని రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కించారు. అయితే వీటిలో ఓవరాల్ కలెక్షన్ పరంగా అమరన్ మరింతగా  పైచేయిగా నిలిచింది. అయితే విషయం ఏమిటంటే, మళ్ళి ఈ ఏడాది సెప్టెంబర్ 5న మరొక్కసారి బాక్సాఫిస్ వద్ద దుల్కర్, శివ కార్తికేయన్ ల సినిమాలు క్లాష్ కు సిద్దమవవుతున్నాయి.

దుల్కర్ ప్రస్తుతం సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో కాంత అనే మూవీ చేస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. మురుగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ చేస్తున్న మూవీ మదరాసి. ఇది కూడా అదే రోజున రిలీజ్ కానుంది.

ఇక మరోవైపు ఆగష్టు 27న రవితేజ మాస్ జాతరతో పాటు సెప్టెంబర్ 5న తేజ సజ్జ మిరాయ్ కూడా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. వీటిలో ఏ ఏ సినిమా ఎంతమేర సక్సెస్ అవుతాయో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version