తమిళ యువనటుడు కం దర్శకుడు అయిన ప్రదీప్ రంగనాథన్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా డ్రాగన్. ఇటు తెలుగులో ఈ మూవీ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ టైటిల్ తో రిలీజ్ అయింది. కయదు లోహర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఫస్ట్ డే నుంచి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
యూత్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన డ్రాగన్ మూవీ ప్రస్తుతం తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ స్థాయిలో కలెక్షన్ తో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా తమిళనాడులో రూ. 40 కోట్లు కు పైగా రాబట్టగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్ల వరకు రాబట్టింది.
ఇక రెస్టాఫ్ ఇండియా కలిపి మొత్తం ఇండియాలో రూ. 57 కోట్లు ఈ సినిమా రాబట్టింది. మరోవైపు ఓవర్సీస్ లో కూడా డ్రాగన్ అదరగొడుతూ దూసుకెళ్తోంది. అక్కడ 2.25 మిలియన్ డాలర్స్ అనగా దాదాపుగా రూ. 19 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుని ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 76 కోట్లతో దూసుకెళ్తోంది డ్రాగన్.
ఈ దూకుడు చూస్తుంటే అతి త్వరలో ఈ సినిమా రూ. 100 కోట్లకు చేరుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఆకట్టుకునే కథ కథనాలతో పాటు నటుడు ప్రదీప్ రంగనాథ్ యాక్టింగ్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా చెప్పాలి