తాజాగా యువ నటుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా కయదు లోహర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా యువ దర్శకుడు అశ్వత్ మారి ముత్తు దర్శకత్వలో తెరకెక్కిన లేటెస్ట్ యూత్ఫుల్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ డ్రాగన్.
ఈ మూవీ తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ టైటిల్ తో రిలీజ్ అయింది. అటు తమిళ్, ఇటు తెలుగులో రెండు చోట్ల పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్ తో ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. ముఖ్యంగా హీరో ప్రదీప్ రంగనాథన్ అదిరిపోయే యాక్టింగ్ తో పాటు ఆకట్టుకునే కథ, కథనాలు, దర్శకుడు అశ్వత్ మూవీ సక్సెస్ అవడంతో తాజాగా తెలుగు సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్.
ఈ సందర్భంగా దర్శకుడు అశ్వత్ మారి ముత్తు మాట్లాడుతూ, తమ సినిమాకి ఇంతటి విజయం అందించిన తెలుగు, తమిళ ఆడియన్స్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గతంలో అశోక్ సెల్వన్ తో తాను తీసిన ఓ మై కడువలె మూవీ చూసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్, ఆ మూవీని ఎంతో మెచ్చుకోవడంతో అది ఎంతోమందికి రీచ్ అయిందని అన్నారు. ఆ విధంగా డ్రాగన్ మూవీ కూడా ఆయన చూసి తన అభిప్రాయాన్ని తెలపాలని, ఆ విషయం ఆయన వరకు తీసుకెళ్లండి అంటూ సరదాగా మాట్లాడుతూ చెప్పారు.