ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్. ఇటీవల ఐదేళ్ల క్రితం రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకున్న ఇస్మార్ట్ శంకర్ మూవీకి ఇది సీక్వెల్ అనేది తెలిసిందే.
ఈ మూవీని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మితో కలిసి పూరి జగన్నాథ్ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తుండగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, మూడు సాంగ్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ ఫై మంచి అంచనాలు ఏర్పరిచాయి.
విషయం ఏమిటంటే, డబుల్ ఇస్మార్ట్ నుండి థియేట్రికల్ ట్రైలర్ ని ఆగష్టు 4న రిలీజ్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషయల్ గా అనౌన్స్ చేసారు. రామ్ మంచి పవర్ఫుల్ రోల్ చేస్తున్న ఈ మూవీ స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 15న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. మరి రెండవ సారి రామ్, పూరి కలిసి చేస్తున్న ఈ క్రేజీ కాంబో మూవీ రిలీజ్ అనంతరం ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.