ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇటీవల సుకుమార్ తీసిన భారీ పాన్ ఇండియన్ సినిమా పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది. దీని అనంతరం ఇప్పటికే గీత ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలపై త్రివిక్రమ్ తెరకెక్కించనున్న మైథాలజీ మూవీకి సైన్ చేసిన అల్లు అర్జున్ మరోవైపు తాజాగా అట్లీతో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నారు.
దీనిని ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించనుండగా ఈ రెండు సినిమాలపై కూడా దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరిలో విపరీతమైన క్రేజ్ ఉంది. కాగా మ్యాటర్ ఏమిటంటే, ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ రెండు సినిమాల నుంచి రెండు అప్డేట్లు అయితే ఉండనున్నాయట. కాగా వాటిలో అట్లీ మూవీ యొక్క అనౌన్స్ మెంట్ గ్లింప్స్ తో పాటు త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ఒక ప్రత్యేక పోస్టర్ అనౌన్స్మెంట్స్ రానున్నాయని తెలుస్తోంది.
అయితే వీటిలో అట్లీ మూవీ అనౌన్స్ మెంట్ కి సంబంధించి నేడు శ్రీరామనవమి సందర్భంగా ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు ఒక హింట్ తో కూడిన పోస్ట్ చేసారు. ఇక ఈ రెండు సినిమాలు ఒకదాని వెంట మరొకటి వేగంగా చిత్రీకరణ జరిపేందుకు ఆ మూవీ టీమ్స్ సన్నద్ధమవుతున్నాయి.
త్రివిక్రమ్ శ్రీనివాస్ మైథాలజీ కాగా అట్లే సినిమా భారీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్ అని తెలుస్తోంది. వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారట. ఇక రెండు సినిమాల అనంతరం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో పుష్ప 3 మూవీ చేయనున్నారు అల్లు అర్జున్.