Home సినిమా వార్తలు Diwali Releases OTT Streaming Partners దీపావళి రిలీజ్ మూవీస్ ఓటిటి పార్ట్నర్స్ డీటెయిల్స్

Diwali Releases OTT Streaming Partners దీపావళి రిలీజ్ మూవీస్ ఓటిటి పార్ట్నర్స్ డీటెయిల్స్

diwali releases

ఈ ఏడాది ఇప్పటికే సంక్రాంతి పండుగకి పలు సినిమాలు విడుదలై ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అందించాయి. ఇక తాజాగా ఈ దసరాతో పాటు ప్రస్తుత దీపావళి పండుగ కూడా అనేక సినిమాలో ఆడియన్స్ ముందుకు రావడం జరిగింది. యువనటుడు అయిన కిరణ్ అబ్బవరం క అలానే మలయాళ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ తమిళనాట స్టార్ యాక్టర్ శివ కార్తికేయన్ అమరన్ తో పాటు కన్నడ స్టార్ యాక్టర్ శ్రీమురళి భగీరతో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఆడియన్స్ ముందుకు వచ్చాయి.

మరోవైపు హిందీలో కూడా బూల్ బులయ్య సిరీస్ పార్ట్ 3, సింగం ఎగైన్ మూవీస్ కూడా ఆడియన్స్ ముందుకు వచ్చాయి. ఇవన్నీ కూడా ప్రస్తుతం మంచి టాక్ తో బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్నాయి. అయితే ఈ సినిమాల్లో ఏ సినిమా ఓటిటి ఆడియన్స్ ముందుకు రానుంది, అలానే ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ వాటి యొక్క రైట్స్ ని కొనుగోలు చేసిందనే డీటెయిల్స్ చూద్దాం.

లక్కీ భాస్కర్ – నెట్ ఫ్లిక్స్
అమరన్ – నెట్ ఫ్లిక్స్
క – ఈటీవీ విన్
భగీర – నెట్ ఫ్లిక్స్
బ్రదర్ – జీ ఫైవ్
సింగం ఎగైన్ – అమెజాన్ ప్రైమ్ వీడియో
బూల్ బులయ్య 3 – నెట్ ఫ్లిక్స్

సంస్థలు రైట్స్ కొనుగోలు చేసాయి. అయితే తాజాగా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమాల్లో మాత్రం లక్కీ భాస్కర్, క, అమరన్ ఈ మూడు సినిమాలు మాత్రం సూపర్ హిట్ టాక్ అయితే సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాల యొక్క కలెక్షన్ బట్టి చూస్తుంటే ఇవి బాక్సాఫీస్ వద్ద భారీగా పెర్ఫామ్ చేసే అవకాశం కనబడుతోంది. మరోవైపు ఇటు భగీర మరియు బ్రదర్ సినిమాలు కాస్త పర్వాలేదనిపించే స్థాయిలో టాక్ అందుకున్నాయి. అలానే బూల్ బులయ్య, సింగం ఎగైన్ కూడా పాజిటివ్ టాక్ అందుకున్నాయి. మరి వీటిలో మున్ముందు ఏ సినిమా ఏ స్థాయి కలెక్షన్ అందుకుంటుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version