Home సినిమా వార్తలు Avatar 2: అవతార్ 2 సినిమాని భారీ ధరలకు కొనలేకపోయినందుకు సంతోషిస్తున్న డిస్ట్రిబ్యూటర్లు

Avatar 2: అవతార్ 2 సినిమాని భారీ ధరలకు కొనలేకపోయినందుకు సంతోషిస్తున్న డిస్ట్రిబ్యూటర్లు

జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన అవతార్ 2 సినిమా విడుదలకు ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. అవతార్ 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ రేంజ్ లో కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

అయితే చర్చలు సజావుగా సాగకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో అవతార్ 2ను అధిక రేట్లకు కొనుగోలు చేసే ఆలోచనను డిస్ట్రిబ్యూటర్లు విరమించుకున్నారు. ఇక ఇటీవల ప్రీమియర్ షోల నుండి ఈ చిత్రానికి మిశ్రమ సమీక్షలు చూసిన తరువాత వారు ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుతున్నారు. ఈ సినిమాని భారీ ధరలకు కొనుగోలు చేయనందుకు వారు సంతోషిస్తున్నారు.

మనకు తెలిసినట్లుగా, అవతార్ 2 యొక్క అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. తెలుగు ప్రేక్షకులు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా తమకు సినిమా పై ఉన్న నిజమైన ప్రేమను చూపించినప్పటికీ, అవతార్ 2 సినిమాకి ఇతర ప్రాంతాలలో ట్రెండ్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు.

అవతార్ 2 ప్రీ-సేల్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మినహా భారతదేశం అంతటా నిరాశాజనకంగా ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ ఇండియా అడ్వాన్స్ బుకింగ్లు చాలా సాధారణంగా ఉన్నాయి.

ఇప్పుడు ప్రీమియర్ల నుండి డివైడ్ టాక్ రావడంతో, అవతార్ 2 కు మౌత్ టాక్ చాలా కీలకంగా మారింది. టాక్ సరిగా రాని పక్షంలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో నమోదు చేయడం సాధ్యం కాదు. ఇక పెద్ద రన్ టైమ్ కూడా అవతార్ 2 బుకింగ్ లను ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు.

“అవతార్: ది వే ఆఫ్ వాటర్” సినిమా ఆ ఫ్రాంఛైజీ కోసం ప్రణాళిక చేయబడిన ఐదు చిత్రాలలో రెండవది, ఇందులో మూడవ చిత్రం డిసెంబర్ 2024 లో విడుదల కానుంది.

అవతార్ ఫ్రాంఛైజీలో మిగతా భాగాలు ఇప్పటికే అభివృద్ధిలో ఉన్నప్పటికీ, రెండవ భాగం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ప్రదర్శన ఇవ్వకపోతే మిగతా చిత్రాలను రద్దు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని కామెరాన్ నవంబర్ లో చెప్పారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version