Homeసినిమా వార్తలుఘోరమైన టీఆర్పీ రేటింగ్లు తెచ్చుకున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ - 6

ఘోరమైన టీఆర్పీ రేటింగ్లు తెచ్చుకున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ – 6

- Advertisement -

బిగ్ బాస్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేని షో. అంతలా తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఈ రియాలిటీ గేమ్ షోని ఆదరించారు. బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ రియాలిటీ షో ఆధారంగా హిందీలోకి చాలా ఏళ్ల క్రితమే వచ్చి విజయవంతంగా ప్రసారం అయిన ఈ షో, అదే క్రమంలో భారత దేశంలోని చాలా భాషల్లో కూడా ప్రసారం అయింది.

ఈ క్రమంలోనే ఆరేళ్ల క్రితం తెలుగు బుల్లితెర పై కూడా అడుగు పెట్టింది. 2016 నుంచి ఇప్పటి వరకూ ఐదు సీజన్లను విజయవంతగా పూర్తి చేసుకుంది. కాగా మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెండో సీజన్ కు నాచురల్ స్టార్ నాని హోస్ట్ బాధ్యతను తీసుకున్నారు. అయితే మూడవ సీజన్ నుండి హోస్ట్ గా కింగ్ నాగార్జున వ్యవహరిస్తున్నారు. ఇటీవలే నిర్వచించిన ఓటిటి సీజన్లో కూడా హోస్ట్ గా చేసింది నాగార్జున కావడం విశేషం. ఇక బిగ్ బాస్ ఆరో సీజన్ ఇటీవలే అంగరంగ వైభవంగా జరిగిన ప్రీమియర్ ఎపిసోడ్‌తో ప్రారంభం అయింది. మొదటి రోజు మొత్తం 21 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లోకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

బిగ్ బాస్ తెలుగు సీజన్‌ మొదలయినప్పటి నుంచీ ఇదే అత్యధిక రికార్డుగా చెప్పవచ్చు. ఆ 21 మంది కంటెస్టెంట్లుగా.. కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు హౌస్‌లోకి ప్రవేశించారు.

READ  Big Boss: సీజన్ 6 లో పాల్గొనబోతున్నది ఎవరంటే?

బిగ్ బాస్ తెలుగులో ఇదివరకు ప్రసారం అయిన సీజన్ల మొదటి ఎపిసోడ్ల తాలూకు TRP రేటింగ్లను ఒకసారి పరిశీలిస్తే.. మొదటి సీజన్ కు 16.18, రెండో సీజన్ కు 15.05, మూడవ సీజన్ కు 17.9, నాలుగవ సీజన్ కు 18.5, ఐదో సీజన్ కు15.70 రేటింగులు వచ్చాయి. అయితే తాజాగా మొదలైన ఆరో సీజన్ తొలి ఎపిసోడ్ కి మాత్రం ఎవరూ ఊహించని విధంగా 8.86 రేటింగ్ వచ్చింది. ఈ రేటింగ్ అందరినీ విస్మయానికి గురి చేసింది.

దీనికి కారణం లేకపోలేదు. ఇటీవలే తెలుగు బిగ్ బాస్ చరిత్రలో మొట్టమొదటిసారి ఓటిటి సీజన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ సీజన్ అలా ముగియగానే కొంచెం వ్యవధి కూడా లేకుండా టివిలో ఆరో సీజన్ మొదలు పెట్టడం వల్లే ప్రేక్షకులు ఈసారి బిగ్ బాస్ షోను చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదని కొందరు విశ్లేషకులు అంటున్నారు.

అయితే ఇందులో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మరో వాదన కూడా వినిపిస్తోంది. బిగ్ బాస్ సీజన్ అనేది ఒక్క ఎపిసోడ్ తో లేదా ఒకటి రెండు వారాలలో అయిపోయేది కాదు. దాదాపు పదిహేను వారాల పాటు ప్రసారం అయ్యే రియాలిటీ షో.

కాబట్టి మొదట్లో ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపకపోయినా.. కంటెస్టెంట్ల మధ్య జరిగే వాదనలు, గొడవలు చూపిస్తూ వచ్చే ప్రోమోల వల్ల మళ్ళీ బిగ్ బాస్ షో నిలదొక్కుకునే అవకాశం ఉందని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. మరి బిగ్ బాస్ సీజన్ ఇక ముందు అయినా తన జోరు పెంచి టీఆర్పీ రేటింగ్లను మళ్ళీ భారీ స్థాయిలో నమోదు చేస్తుందని ఆశిద్దాం.

READ  భారీ ఓపెనింగ్స్ దిశగా సాగుతున్న బ్రహ్మస్త్ర

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories