తమిళ స్టార్ హీరో అజిత్ తెగింపు ఈ సంక్రాంతికి మన తెలుగు సినిమాలైనవాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో పాటు తన తోటి తమిళ హీరో విజయ్ డబ్బింగ్ చేస్తున్న వారసుడు చిత్రాలతో పాటు విడుదల కానుంది.
ఇటీవల విడుదలైన ట్రైలర్ ఈ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేయడంతో పాటు తమిళనాడు బుకింగ్స్.. అలాగే US ప్రీ సేల్స్ కూడా ఒక పెద్ద హీరోకి ఆశించిన స్థాయిలోనే జరుగుతున్నాయి. అయితే, ఈ సినిమా తెలుగు వెర్షన్ తెగింపు బుకింగ్స్ మాత్రం నిర్మాతలకు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయని చెప్పాలి.
జనవరి 11న అజిత్ నటించిన తెగింపు సోలో అడ్వాంటేజ్ రిలీజ్ ను కలిగి ఉండటంతో ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు భారీ సంఖ్యలో లభిస్తున్నాయి. అయినప్పటికీ, ఈ సినిమాకి బుకింగ్స్ చాలా ఘోరంగా ఉన్నాయి మరియు మంచి థియేటర్లలో కూడా టిక్కెట్లు అనుకున్న విధంగా అమ్ముడుపోవడం లేదు.
హైదరాబాద్ లో తెగింపు సినిమాకు మొత్తం 382 షోలు వేయగా, కేవలం 14.91 శాతం ఆక్యుపెన్సీతో మొత్తం సిటీ గ్రాస్ రూ.45,73,510.00గా ఉంది. నిజానికి, బ్యాడ్ బుకింగ్స్ కారణంగా ఈ సినిమాకు చాలా షోలు క్యాన్సిల్ అవుతున్నాయి.
ఇప్పుడు ఈ సినిమా ఫలితం వాక్-ఇన్స్ మీద ఆధారపడి ఉంటుంది మరియు ప్రీమియర్ షోల నుంచి వచ్చే టాక్ మీద కూడా చాలా ఆధారపడి ఉంటుంది. ఇక పండుగ రోజుల్లో థియేటర్లను హోల్డ్ చేయాలి అంటే మంచి టాక్ ఈ చిత్రానికి ఇప్పుడు చాలా ముఖ్యమనే చెప్పాలి.
హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించారు. అజిత్, వినోద్, బోనీ కపూర్ కాంబినేషన్లో వచ్చిన మూడో చిత్రం ‘తునివు’. తునివుకు ముందు ఈ ముగ్గురూ నెర్కొండ పార్వై, వాలిమై చిత్రాలకు పని చేశారు. ఈ చిత్రంలో అజిత్ కుమార్ తో పాటు మంజు వారియర్, సముద్రఖని, జాన్ కొక్కెన్ కీలక పాత్రలు పోషించారు.