Homeసినిమా వార్తలుAmigos: కళ్యాణ్ రామ్ అమిగోస్ కు ఘోరమైన అడ్వాన్స్ బుకింగ్స్

Amigos: కళ్యాణ్ రామ్ అమిగోస్ కు ఘోరమైన అడ్వాన్స్ బుకింగ్స్

- Advertisement -

కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ రేపు థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. ఇది అటు నందమూరి అభిమానుల కానీ.. సాధారణ ప్రేక్షకుల కానీ ఆశించిన పరిస్థితి కానే కాదు.

https://twitter.com/vamsikaka/status/1623537201761099779?t=OonN3e4EFxPTaRTUP8fHgQ&s=19

బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన సినిమా అయిన అమిగోస్ ప్రేక్షకుల్లో ఆశించిన బజ్ క్రియేట్ చేయలేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం అనే చెప్పాలి. నిజానికి ఈ సినిమా ట్రైలర్, కళ్యాణ్ రామ్ లుక్ పర్ఫెక్ట్ గా అనిపించినా సినిమాకు ఈ టైటిల్ యే ప్రధాన లోపం అని చెప్పొచ్చు.

నిజానికి ఆడియో కూడా సరిగా క్లిక్ కాలేదు. ఇక అమిగోస్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి సక్సెస్ ఫుల్ సినిమాగా నిలవాలంటే ఇప్పుడు ఈ సినిమాకి సూపర్ స్ట్రాంగ్ మౌత్ టాక్ కావాలి. ఈ రోజుల్లో మార్నింగ్ షోల నుంచి మంచి టాక్ రాకపోతే చిన్న, కొత్త తరహా సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోవడం చాలా కష్టంగా మారింది.

READ  Sankranti-2023: 2023 సంక్రాంతికి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయిన దర్శకులు

ఒకేలా ముగ్గురు వ్యక్తులు కనిపించడం అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాతో శాండల్ వుడ్ బ్యూటీ ఆషికా రంగనాథ్ తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం కానున్నారు. కోలీవుడ్ సంగీత దర్శకుడు జిబ్రాన్ ఈ చిత్రానికి బాణీలు సమకూర్చారు.

Follow on Google News Follow on Whatsapp

READ  Pathaan: తెలుగు, తమిళ సినిమాల కంటే హిందీ మార్కెట్ ఇప్పటికీ పెద్దదని నిరూపించిన పఠాన్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories