లోకేష్ కనగరాజ్ అంటే ఇప్పుడు కేవలం పేరు మాత్రమే కాదు, కోలీవుడ్ లో కానీ, దక్షిణాది సినీ పరిశ్రమలో కానీ ఒక బ్రాండ్ గా ప్రసిద్ధి చెందారు. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తన సినిమాలతో పూర్తిగా డిఫరెంట్ లీగ్ లోకి వెళ్లిపోయారు. అతని ఫిల్మోగ్రఫీ అద్భుతమైన విధంగా ఉంది. మానగరం సినిమాతో కెరీర్ ను ఒక మోస్తరు విజయంతో ప్రారంభించిన లోకేష్ ఖైదీతో కలిసి నేరుగా సిక్సర్ కొట్టారు.
అర్హత ఉన్న వారు ఎప్పుడూ ఉన్నత స్థాయికి చేరుకుంటారనేది నానుడి. లోకేష్ విషయంలో కూడా అదే జరిగింది. తమిళ సూపర్ స్టార్ విజయ్ తి మాస్టర్, ఆ తర్వాత విలక్షణ నటుడు కమల్ హాసన్ తో విక్రమ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ సమర్థుడైన దర్శకుడు. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే అవకాశం దొరికిన ప్రతి సారీ తనను తాను నిరూపించుకున్నారు.
సాధారణంగా 90 శాతం సినిమాలకు ఆయా చిత్ర బృందాలు రిలీజ్ డేట్ దగ్గర పడే వరకూ సినిమాలను ప్రమోట్ చేయవు. కానీ లోకేష్ కనగరాజ్ మాత్రం ఎప్పుడూ తన సినిమాల అనౌన్స్ మెంట్స్ తోనే క్యూరియాసిటీ, బజ్ క్రియేట్ చేస్తుంటారు. విక్రమ్ సినిమాకు కూడా కేవలం ఒక్క గ్లింప్స్ మంచి బజ్ క్రియేట్ చేశారు. అక్కడి నుంచి మొదలైన క్రేజ్ తమిళనాట ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసే వరకూ కొనసాగింది.
ఇప్పుడు దళపతి 67తో కూడా అదే రిపీట్ చేస్తూ నటీనటుల గురించి డీటైల్స్, బిజినెస్ డీల్స్ అనౌన్స్మెంట్స్ ఇలా రోజువారీ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ విషయాలు ఇప్పటికే సినిమా పై భారీ బజ్ ను సెట్ చేశాయి. ఎంతైనా ఈ తరం దర్శకులు లోకేష్ కనగరాజ్ నుంచి మార్కెటింగ్ మెళకువలు నేర్చుకోవాలి.
ఇప్పటికే పలు పాన్ ఇండియా సినిమాలు ఉండగా అందులో 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ ఆయా టీమ్స్ నుంచి ఆ సినిమాల గురించి ఎలాంటి అప్డేట్స్ రాలేదు. అయితే ఇక్కడ మాత్రం టీజర్ విడుదలకు ముందే తన సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకునేలా చేస్తున్నారు లోకేష్. ఈ యువ దర్శకుడు ప్రస్తుతం తన కెరీర్ లో డ్రీమ్ ఫేజ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్ హీరోల కంటే లోకేష్ బ్రాండ్ పెద్దది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దళపతి 67, ఖైదీ 2, విక్రమ్ 2 సినిమాలతో ఆయన క్రేజ్ రెట్టింపు కావడం ఖాయం.