సంక్రాంతి 2023 సినిమాలకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చినప్పుడు ప్రేక్షకులు చాలా ఆనందంగా ఉత్సాహంగా స్పందించారు. దీనికి ప్రధాన కారణం అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్ రెండు పెద్ద సినిమాల మధ్య పోటీ జరగడమే. టాలీవుడ్ లో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య ద్వారా బాలయ్య వర్సెస్ చిరు పోటీ జరగగా, కోలీవుడ్ లో అజిత్ వర్సెస్ విజయ్ పోటీ తునివు, వారిసు సినిమాల రూపంలో జరిగింది.
2023 సంక్రాంతికి అభిమానులు తమ అభిమాన స్టార్ హీరోలను తెర పై చూడగలిగినప్పటికీ అన్ని వర్గాల నుంచి ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఏ సినిమాకీ ప్రేక్షకుల నుంచి ఏకగ్రీవంగా సూపర్ హిట్ టాక్ రాకపోగా.. దర్శకులు మాత్రం ఓవర్ గా ప్రమోషన్స్ లో పాల్గొంటూ చాలా ఉత్సాహంగా స్పందిస్తున్నారు.
నిజానికి రెండు సినిమాలలో కంటెంట్ కూడా చాలా రెగ్యులర్ గా, రొటీన్ గా ఉండటంతో.. విడుదలకు ముందు ఇంటర్వ్యూలలో దర్శకులు చూపించిన ఓవర్ కాన్ఫిడెన్స్ చూసి ప్రేక్షకులు అవాక్కవుతున్నారు.
వంశీ పైడిపల్లి అయినా, హెచ్ వినోద్ అయినా, బాబీ అయినా, గోపీచంద్ మలినేని అయినా అందరూ కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ పైనే కాకుండా కంటెంట్ పైనే దృష్టి పెట్టాలని ప్రేక్షకులు, విమర్శకులు సూచిస్తున్నారు. ఈ దర్శకులెవరూ కనీసం డీసెంట్ కంటెంట్ కూడా ఇవ్వకుండా సంక్రాంతి సీజన్ వంటి మంచి అవకాశాన్ని వృధా చేసుకున్నారు అని అందరూ అంటున్నారు.
అయితే ఈ యువ దర్శకులు అందరూ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మరియు తమిళ సూపర్ స్టార్ లైన అజిత్, విజయ్ లని వెండితెర పై బాగా చూపించడం మాత్రమే వారు చేసిన ఒకే ఒక మంచి పని అని చెప్పచ్చు. ఈ స్టార్ హీరోలు తమ తమ సినిమాలను స్క్రీన్ ప్రెజెన్స్ తో నడిపించడంతో ఆయా సినిమాలు అభిమానులను కాస్త అయినా ఆకట్టుకున్నాయి. .