తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ రేట్ చాలా తక్కువ అనేది అందరికీ తెలిసిన విషయమే.. అయితే ఇలాంటి పరిస్తితుల్లో కూడా కొందరు దర్శకులు అనవసరంగా తమ సమయాన్ని, డబ్బును సినిమాల నిర్మాణంలో పెట్టి అనవసరమైన ఆర్థిక ఒత్తిళ్లతో తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఒక దర్శకుడు నిర్మాణంలో నిమగ్నం కాకపోవడమే మంచిది అని చెప్పాలి.
దర్శకుడు కొరటాల శివ తన గత చిత్రం ఆచార్య నిర్మాణం, వ్యాపారంలో పాలుపంచుకోవడంతో వ్యక్తిగతంగా, ఆర్థికంగా ఇంత ఇబ్బంది పడ్డాడు అనేది తెలిసిందే. ఇప్పుడు మరో దర్శకుడు గుణశేఖర్ కూడా తన తాజా చిత్రం శాకుంతలం విషయంలోనూ అదే జరిగిందని కూడా మనకు తెలుసు.
వీరిద్దరే కాదు చాలా మంది దర్శకులు కూడా తమ సినిమాల నిర్మాణంలో పాలుపంచుకుని అదే తప్పు చేస్తున్నారు. దర్శకత్వం మరియు నిర్మాణ బాధ్యతలను ఒకేసారి నిర్వహించడం అనేది చాలా కష్టమైన పని. అలాంటి రెండు భాద్యతలను ఒకేసారి నిర్వహించడానికి చాలా సమయం మరియు శక్తిని కేటాయించాల్సి ఉంటుంది.
అయితే ఎంత కష్టపడినా తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉండటంతో దర్శకులు తమ సినిమా విజయం పై ధీమాగా ఉండలేకపోతున్నారు. కాబట్టి ఒక సినిమా హిట్ అయితే దర్శకులకు ఇబ్బంది ఉండదు కానీ అది ఫెయిల్ అయినప్పుడు మాత్రం ఆ ఫెయిల్యూర్ ఇమేజ్ వారి కెరీర్ పై ప్రభావం చూపుతుంది కాబట్టి తర్వాతి సినిమాలకు అవకాశం రావడం చాలా కష్టంగా మారుతుంది.