Homeసినిమా వార్తలుమైత్రి మేకర్స్ ను ఇబ్బంది పెడుతున్న సుకుమార్

మైత్రి మేకర్స్ ను ఇబ్బంది పెడుతున్న సుకుమార్

- Advertisement -

పుష్ప 2 షూటింగ్ ఆలస్యం అవుతూనే వస్తుంది. ఇటీవల దర్శకుడు సుకుమార్ ఆరోగ్యం కాస్త బాగోక పోవడంతో స్క్రిప్ట్ వర్క్, ఇతర ప్రి ప్రొడక్షన్ పనులు ఆగిపోయాయి అని తెలిసింది.

అయితే తాజాగా వినిపిస్తున్న వార్తలు ఏంటంటే సుకుమార్ పని తీరు వల్ల మైత్రి మూవీ మేకర్స్ కాస్త ఇబ్బందులు ఎదురుకుంటున్నారు అట. తొలుత జూన్ లో షూటింగ్ అనుకుని మళ్ళీ ఆగస్ట్ కి పోస్ట్ పొన్ చేయాల్సి వచ్చింది. ఇలా మాటి మాటికీ నటీనటుల కాల్ షీట్స్ బుక్ చేసి పెట్టడం నిర్మాతలకు బాగా ఖర్చుతో కూడుకున్న పని.

సుకుమార్ తో పని చేసిన యే ప్రొడక్షన్ టీం అయినా ఇలాంటి ఇబ్బందులు ఎదురుకోవలసిందే. ఎందుకంటే సుకుమార్ స్క్రిప్ట్ వర్క్ కి ఇంకా షూట్ స్టార్ట్ అయిన తరువాత చేసే మార్పులకు ఎక్కువ సమయం తీసుకుంటాడు అని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్.

అయితే క్రియేటివ్ జీనియస్ గా తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న సుకుమార్ కి ఆ పేరు వల్లే ఇలాంటి సమస్యలను తట్టుకుని మరీ నిర్మాతలు ఆయనతో సినిమాలు తీయడానికి ముందుకు వస్తున్నారు.

ప్రత్యేకించి మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ తో ఇదివరకే రెండు సినిమాలు తీశారు కాబట్టి ఆయన వర్కింగ్ స్టైల్ వాళ్ళకి బాగా తెలుసు. ఆల్రెడీ రెండు బ్లాక్ బస్టర్ లు అందించిన అనుభవం ఉండటంతో పాటు ఇప్పుడు పుష్ప 2 పాన్ ఇండియా రేంజ్ లో క్రేజీయస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి ఎలా అయినా తాము పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుంది అని మైత్రి గ్రూప్ కి తెలుసు. అందుకే సుకుమార్ ఓకే చెప్పిన తరువాతే వాళ్ళు షూటింగ్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

READ  రాకీ భాయ్ తో సాలార్?

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories