భారతీయ సినిమా పరిశ్రమలోని దిగ్గజ దర్శకుల్లో శంకర్ షణ్ముగం కూడా ఒకరు. తమిళ దర్శకుడైన శంకర్ 90వ దశకంలో తీసిన జెంటిల్మెన్, భారతీయుడు, ఒకేఒక్కడు వంటి సినిమాలు అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ఇటీవల రోబో, 2.0, ఐ సినిమాల ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చిన శంకర్ తాజాగా కమల్ హాసన్ తో భారతీయుడు 2, అలానే రామ్ చరణ్ తో గేమ్ ఛేంజెర్ మూవీస్ చేస్తున్నారు.
వీటిలో కమల్ భారతీయుడు 2 మూవీ జులై 12న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. తాజాగా ఏర్పాటు చేసిన ఈ మూవీ ప్రెస్ మీట్ లో భాగంగా తన నెక్స్ట్ ప్రాజక్ట్స్ ని అనౌన్స్ చేసారు శంకర్. తదుపరి తన వద్ద మూడు స్క్రిప్ట్స్ ఉన్నాయని, అందులో ఒకటి హిస్టారికల్ కాగా మరొకటి జేమ్స్ బాండ్ తరహా జానరని, మూడవది 2012 మాదిరిగా సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ అని అన్నారు.
ఇవి మూడు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయం, విఎఫ్ఎక్స్ తో తెరకెక్కించే సినిమాలని ఆయన తెలిపారు. ఇక ప్రస్తుతం చేస్తున్న గేమ్ ఛేంజర్ కి సంబంధించి కేవలం 15 రోజుల షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని, భారతీయుడు 2 రిలీజ్ అనంతరం ఆ బ్యాలెన్స్ షూట్ పూర్తి చేస్తాం అన్నారు. సాధ్యమైనంతవరకు గేమ్ ఛేంజెర్ ని ఈ ఏడాది ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు శంకర్.