Homeసినిమా వార్తలుRRR సీక్వెల్ పై స్పందించిన దర్శకుడు రాజమౌళి

RRR సీక్వెల్ పై స్పందించిన దర్శకుడు రాజమౌళి

- Advertisement -

RRR సినిమా విడుదలైనప్పటి నుండి, అటు ప్రేక్షకులు, ఇటు విమర్శకులు మరియు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందనను అందుకుంటుంది. అంతే కాకుండా హాలీవుడ్ నుండి కూడా కొంత మంది గొప్ప దర్శకులు మరియు సాంకేతిక నిపుణుల దగ్గర నుంచి ఊహించని ప్రశంసలను అందుకుంది.

ఆర్ఆర్ఆర్ సినిమాను తాజాగా జపాన్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందుకోసం ప్రచార కార్యక్రమాల నిమిత్తం రాజమౌళి, రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు జపాన్ వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో ఈ దిగ్గజ దర్శకుడు మరియు ప్రధాన నటులు అనేక రకాల ఇంటర్వ్యూలలో కనిపించారు.

అలాంటి ఒక ఇంటర్వ్యూలో, RRR సినిమా సీక్వెల్ గురించి ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికుల నుంచి ఇదే డిమాండ్ ప్రస్తుతం ఉంది. రామ్ మరియు భీమ్ ఇద్దరూ సజీవంగా ఉండి, వారి మాతృభూమికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో వారి స్వంత మిషన్లను ప్రారంభించినందున సినిమా ముగింపు కూడా అలాంటి అవకాశాన్ని అనుమతిస్తుంది.

READ  నవంబర్లో ఆది రీ రిలీజ్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గట్టి సవాలే

ఈ మిలియన్ డాలర్ల ప్రశ్నకు రాజమౌళి స్పందిస్తూ, సీక్వెల్ ప్రారంభించడానికి తాను కూడా ఆసక్తిగా ఉన్నానని అభిప్రాయపడ్డాడు. RRR అంటే ఇద్దరు సూపర్‌హీరోలు కలిసి రావడం మరియు కలిసి పోరాడడం లేదా కొన్ని సార్లు ఒక గొప్ప కారణం కోసం ఒకరి పై ఒకరు పోరాడడం అని అయన చెప్పారు.

రామ్ మరియు భీమ్‌ల మధ్య వివాదాస్పద పరిస్థితులే RRR సినిమాని భారీ యాక్షన్ డ్రామాగా మార్చాయి.అందుకే ఇద్దరు ప్రధాన పాత్రల మధ్య మరొక అద్భుతమైన సంఘర్షణ వస్తేనే సీక్వెల్ ఉంటుందని రాజమౌళి చెప్పారు.

RRR సీక్వెల్‌ను రూపొందించడానికి రచయిత విజయేంద్ర ప్రసాద్ లేదా రాజమౌళి కుటుంబం నుండి ఎవరైనా బలమైన ప్లాట్ పాయింట్‌ను అందిస్తారో వేచి చూడాలి అని అభిమానులు, సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మనం కూడా వేచి చూద్దాం!

Follow on Google News Follow on Whatsapp

READ  బ్లాక్ బస్టర్ బింబిసార ఓటీటీ స్ట్రీమింగ్ డీటైల్స్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories