Homeసినిమా వార్తలుమళ్ళీ నాగ చైతన్య దగ్గరకే వచ్చిన దర్శకుడు పరశురామ్

మళ్ళీ నాగ చైతన్య దగ్గరకే వచ్చిన దర్శకుడు పరశురామ్

- Advertisement -

యువ సామ్రాట్ నాగ చైతన్య దర్శకుడు పరశురామ్‌తో కలిసి గతంలోనే పనిచేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా రూపు దాల్చలేదు. చాలా రోజులుగా ఈ కాంబినేషన్‌ పై పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ యువ హీరో మరియు దర్శకుడి మధ్య సృజనాత్మక విభేదాలు వచ్చినట్లు కూడా సమాచారం అందింది.

వాస్తవానికి, నాగ చైతన్యతో పరశురామ్ చేయాల్సిన సినిమా చాలా కాలం క్రితం అధికారికంగా ధృవీకరించబడింది, కానీ దర్శకుడు మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమాకు దర్శకత్వం వహించాలని ఎంచుకున్నారు. ఎందుకంటే అది స్టార్ హీరోకి దర్శకత్వం వహించే అవకాశం కాబట్టి వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు కదా.

ఇక సర్కారు వారి పాట సినిమా తర్వాత.. పెద్ద హీరోలు తనతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతారని దర్శకుడు పరశురామ్ భావించారు. కానీ అతను అనుకున్నట్లు ఏదీ జరగలేదు.

కాబట్టి, అతను మళ్లీ నాగ చైతన్యతో కలిసి పని చేయడానికి సిద్ధమైనట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. నాగ చైతన్యకు ఈ కథ నచ్చిందని, ప్రస్తుతం పరశురామ్ ఆ కథను పూర్తి స్థాయి స్క్రిప్ట్‌గా రూపొందిస్తున్నారని, వచ్చే ఏడాదిలో సినిమా ప్రారంభం కానుందని కూడా చెబుతున్నారు. 14 రీల్స్‌ బ్యానర్‌ ప్లస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇక వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తున్న తాజా తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం కొన్ని నెలల క్రితం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇటీవలే ఈ చిత్రానికి టైటిల్ పెట్టారు. తాజాగా నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ రివీల్ చేశారు.

READ  నిర్మాతల మండలి యొక్క నిబంధనలకు వ్యతిరేకంగా సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తున్న నిర్మాతలు

ఈ చిత్రానికి “కస్టడీ” అనే పేరు పెట్టారు మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నాగ చైతన్య భయంకరమైన ఉగ్రరూపం కనిపించారు. ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్: “ప్రపంచంలో నువ్వు చూడాలనుకునే మార్పుగా ముందు నువ్వే ఉండాలి.” కాగా ఈ సినిమాలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. ఇంతకు ముందు తను నాగ చైతన్యతో కలిసి బంగార్రాజు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

నాగ చైతన్య కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాల్లో ‘కస్టడీ’ ఒకటి. ఈ ద్విభాషా చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్ తుండగా.. పవన్‌కుమార్ సమర్పిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అరవింద్ స్వామి విలన్‌గా నటిస్తుండగా, ప్రియమణి పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సంపత్ రాజ్, శరత్‌కుమార్, ప్రేమ్‌జీ, వెన్నెల కిషోర్ తదితరులు సహా ప్రత్యేక అతిధి పాత్రలో నటుడు జీవా నటిస్తున్నారు.

విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన నాగ చైతన్య గత చిత్రం థాంక్యూ, హీరో మరియు ఆయన అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఆ చిత్రాన్ని ఒక రొమాంటిక్ చిత్రంగా ఉంటుందని ప్రేక్షకులు ఆశించారు, కానీ సినిమా ఆశించని రీతిలో విఫలమైంది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కనీస స్థాయిలో ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది.

Follow on Google News Follow on Whatsapp

READ  బాక్సాఫీస్ వద్ద ఇటీవలి అక్కినేని హీరోల సినిమాల కన్నా ఎక్కువ కలెక్షన్లు నమోదు చేసిన సమంత యశోద


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories