- Advertisement -
కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన విక్రమ్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అటు విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ లు కూడా దండిగా రాబడుతోంది "విక్రమ్".కమల్ తో పాటు ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి పాత్రలకు కూడా న్యాయం చేసి ఆకట్టుకున్న లోకేష్, సినిమా చివరిలో "విక్రమ్" సీక్వెల్ కి "ఖైదీ" సినిమాకీ లింక్ పెట్టాడు.దీంతో లోకేష్ యూనివర్స్ లో తరువాత రాబోయే చిత్రానికి అంచనాలు పెరిగిపోయాయి, నెటిజన్స్ అయితే ఆల్రెడీ కథల, సన్నివేశాలు రాసేస్తూ తెగ ఎక్సైట్ అయిపోతున్నారు ఆ అంచనాలను, ఆసక్తి నీ మరింత పెంచే విధంగా మరో కొత్త న్యూస్ బయటకి వచ్చింది. "విక్రమ్" సినిమా విడుదల తరువాత దర్శకుడు లోకేష్ ప్రసిద్ధ ఫిల్మ్ క్రిటిక్ అయిన భరద్వాజ రంగన్ తో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అందులో భాగంగానే "ఖైదీ 2" లో ఏమేమి ఆసక్తికర అంశాలు ఉంటాయో చెప్తూ, జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీ కబడ్డీ పోటీ లు గెలిచి ఛాంపియన్ అయ్యాడు అని, తనతో ఉన్న బ్యాగ్ లో వాటికి సంబంధించిన కప్ లు ఉన్నాయి అని లోకేష్ వివరించారు మొదటి భాగం లో ఆ సన్నివేశాలు చూపించలేదు కానీ రెండో భాగంలో మాత్రం వాటి చుట్టూ మంచి సన్నివేశాలు తెరక్కిస్తానని దర్శకుడు లోకేష్ చెప్పుకొచ్చారు.
- Advertisement -