Homeసినిమా వార్తలుమరో వెబ్ సీరీస్ తీసే ఆలోచనలో దర్శకుడు క్రిష్

మరో వెబ్ సీరీస్ తీసే ఆలోచనలో దర్శకుడు క్రిష్

- Advertisement -

దర్శకుడు క్రిష్ కు ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో మంచి అభిరుచి గల దర్శకుడిగా పేరు ఉంది. అద్భుతమైన సందేదానికి కమర్షియల్ అంశాలు జతచేసి సినిమాలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు.

‘గమ్యం’ సినిమాతో తన దర్శకుడిగా తన ప్రయాణం ప్రారంభించిన క్రిష్ ఆ తర్వాత ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’, ‘కంచె’ వంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇక బాలకృష్ణతో చేసిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాతో చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలు కూడా తీయగలనని నిరూపించుకున్నారు.క్రిష్ చివరిగా తీసిన సినిమా “కొండపొలం”. సన్నపు రెడ్డి వెంటకరామిరెడ్డి రచించిన న‌వ‌ల ఆధారంగా క్రిష్ జాగ‌ర్ల‌మూడి తీసిన ఆ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఘోరంగా పరాజయం పొందింది. అయితే కథా నేపథ్యానికి,ఎం ఎం కీరవాణి అందించిన పాటలకి మంచి గుర్తింపు దక్కిందని చెప్పాలి.

ప్రస్తుతం క్రిష్..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “హారి హర వీర మల్లు” సినిమా చిత్రిస్తున్నారు.రెండేళ్ల కిందట ప్రకటించిన ఈ సినిమా పలు మార్లు షూటింగ్ వాయిదా పడింది. కరోనా వేవ్ లు మాటి మాటికీ రావడం,సినిమాలో నటీనటులు మారిపోవడం, ఇక పవన్ కళ్యాణ్ మధ్యలో ఈ సినిమా ఆపి భీమ్లా నాయక్, వినోదాయసీతం రీమేక్ మొదలు పెట్టడం ఇలా రకరకాల కారణాల వల్ల హారి హర వీర మల్లు ఆలస్యం అవుతూ వస్తుంది.

READ  విడాకులపై క్లారిటీ ఇచ్చిన హేమచంద్ర, శ్రావణ భార్గవి

సినిమా చిత్రీకరణలో ఈ జాప్యం పట్ల క్రిష్ విసిగిపోయి ఈ గ్యాప్ లో ఒక వెబ్ సీరీస్ తీయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇటివలే “9 hours” అనే వెబ్ సీరీస్ క్రిష్ నేతృత్వం లో విడుదల అయిన సంగతి తెలిసిందే.బ్యాంక్ దొంగతనం నేపథ్యంలో రూపొందించిన ఆ వెబ్ సీరీస్ కు మంచి స్పందన లభించింది. ఇక తాజాగా క్రిష్ తీయబోయే వెబ్ సిరీస్ మహిళా ప్రాధాన్యత ఉన్న కథగా తెరకెక్కనుందని సమాచారం.ఒక వేశ్య ప్రధాన పాత్రగా కథ ఉండబోతోందని వార్తలు వస్తున్న ఈ వెబ్ సీరీస్ లో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Follow on Google News Follow on Whatsapp

READ  ఆంధ్రప్రదేశ్: థియేటర్ల మూసివేత నిర్ణయం వెనక్కి తీసుకున్న ఎగ్జిబిటర్లు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories