కమల్ హాసన్ మరియు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన విక్రమ్ సినిమా చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. తెలుగు, తమిళ భాషలకు అతీతంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది.
కలేక్షన్ లతో పాటు కల్ట్ స్టేటస్ ను దక్కించుకున్న ఈ సినిమా, అదే రోజు విడుదల అయిన మేజర్ కలెక్షన్ లకి కాస్త గండి కొట్టింది అనేది కాదనలేని నిజం.
మేలో విడుదల అయిన తమిళ యువ హీరో శివ కార్తికేయన్ సినిమా డాన్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.అయితే శివ కార్తికేయన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన డాన్ సినిమాకు ఒక రకంగా విక్రమ్ సినిమా అడ్డుకట్ట వేసింది. విక్రమ్ విడుదల అవ్వకపోయి ఉంటే డాన్ చిత్రం ఒక్క తమిళ నాడులోనే వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసేది.
ఇక సొంత రాష్ట్రంలో విక్రమ్ కి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. కాంపిటిషన్ అనేలా ఏ సినిమా లేకపోవడంతో దుమ్ము లేపుతుంది బాక్స్ ఆఫీస్ వద్ద.
మాస్ దర్శకుడు హరి, హీరో అరుణ్ విజయ్ కాంబినేషన్ లో జూన్ 17న విడుదల కావాల్సిన తమిళ చిత్రం యానై (తెలుగులో ఏనుగు) విక్రమ్ వీర విహారానికి జడిసి తమ రిలీజ్ డేట్ ను జూలై 1కి మార్చుకుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా ఇచ్చిందీ చిత్ర బృందం.